Blood Groups : మనుషుల్లో వివిధ రకాల బ్లడ్ గ్రూప్స్ ఉంటాయన్న సంగతి తెలిసిందే. ఎ, బి, ఓ, ఏబీ.. ఇలా రకరకాల బ్లడ్ గ్రూప్స్ ఉంటాయి. అలాగే వాటిలో పాజిటివ్, నెగెటివ్ అని మళ్లీ రెండు విభాగాలు ప్రతి గ్రూప్‌లోనూ ఉంటాయి. అయితే ఏ గ్రూప్ రక్తం ఉన్నవారు ఎవరికి రక్తం ఇవ్వవచ్చు ? అనే విషయంలో చాలా మంది సందేహాలకు గురవుతుంటారు. అలాంటి వారు కింద ఇచ్చిన సమాచారంతో అవగాహన పెంచుకోవచ్చు. దీంతో ఇకపై ఎవరికైనా ఏ గ్రూప్ రక్తం అయినా అవసరం అయితే.. ఎవరెవరు రక్తం ఇవ్వవచ్చో సులభంగా తెలిసిపోతుంది. మరి ఏ గ్రూప్ రక్తం ఉన్నవారు ఎవరికి రక్తం ఇవ్వవచ్చో ఇప్పుడు తెలుసుకుందామా..!
1. ఎ పాజిటివ్ బ్లడ్ గ్రూప్ ఉన్నవారు ఎ పాజిటివ్, ఎబి పాజిటివ్ బ్లడ్ గ్రూప్స్ ఉన్నవారికి రక్తం ఇవ్వవచ్చు. ఎ పాజిటివ్, ఎ నెగెటివ్, ఓ పాజిటివ్, ఓ నెగెటివ్ బ్లడ్ గ్రూప్స్ ఉన్నవారి నుంచి రక్తం తీసుకోవచ్చు.
2. ఓ పాజిటివ్ బ్లడ్ గ్రూప్ ఉన్నవారు ఓ పాజిటివ్, ఎ పాజిటివ్, బి పాజిటివ్, ఎబి పాజిటివ్ బ్లడ్ గ్రూప్స్ ఉన్నవారికి రక్తం ఇవ్వవచ్చు. ఓ పాజిటివ్, ఓ నెగెటివ్ బ్లడ్ గ్రూప్స్ ఉన్నవారి నుంచి రక్తం తీసుకోవచ్చు.
3. బి పాజిటివ్ బ్లడ్ గ్రూప్ ఉన్నవారు బి పాజిటివ్, ఎబి పాజిటివ్ బ్లడ్ గ్రూప్స్ ఉన్నవారికి రక్తం ఇవ్వవచ్చు. బి పాజిటివ్, బి నెగెటివ్, ఓ పాజిటివ్, ఓ నెగెటివ్ బ్లడ్ గ్రూప్స్ ఉన్నవారి నుంచి రక్తం తీసుకోవచ్చు.
4. ఎబి పాజిటివ్ బ్లడ్ గ్రూప్ ఉన్నవారు కేవలం అదే గ్రూప్ కు చెందిన వారికి రక్తం ఇవ్వవచ్చు. కానీ ఇతర ఏ బ్లడ్ గ్రూప్ ఉన్నవారి నుంచైనా సరే రక్తం తీసుకోవచ్చు.
5. ఎ నెగెటివ్ బ్లడ్ గ్రూప్ ఉన్నవారు ఎ పాజిటివ్, ఎ నెగెటివ్, ఎబి పాజిటివ్, ఎబి నెగెటివ్ బ్లడ్ గ్రూప్స్ ఉన్నవారికి రక్తం ఇవ్వవచ్చు. ఎ నెగెటివ్, ఓ నెగెటివ్ బ్లడ్ గ్రూప్స్ ఉన్నవారి నుంచి రక్తం తీసుకోవచ్చు.
6. ఓ నెగెటివ్ బ్లడ్ గ్రూప్ ఉన్నవారు ఎవరికైనా సరే రక్తం ఇవ్వవచ్చు. కానీ ఈ బ్లడ్ గ్రూప్ ఉన్నవారికి మాత్రం అదే గ్రూప్ రక్తం కావాలి.
7. బి నెగెటివ్ బ్లడ్ గ్రూప్ ఉన్నవారు బి పాజిటివ్, బి నెగెటివ్, ఎబి పాజిటివ్, ఎబి నెగెటివ్ బ్లడ్ గ్రూప్స్ ఉన్నవారికి రక్తం ఇవ్వవచ్చు. బి నెగెటివ్, ఓ నెగెటివ్ బ్లడ్ గ్రూప్స్ ఉన్నవారి నుంచి రక్తం తీసుకోవచ్చు.
8. ఎబి నెగెటివ్ బ్లడ్ గ్రూప్ ఉన్నవారు ఎబి పాజిటివ్, ఎబి నెగెటివ్ బ్లడ్ గ్రూప్ వారికి రక్తం ఇవ్వవచ్చు. ఎబి నెగెటివ్, ఎ నెగెటివ్, బి నెగెటివ్, ఓ నెగెటివ్ బ్లడ్ గ్రూప్ ఉన్నవారి నుంచి రక్తం తీసుకోవచ్చు.
ఈ సమాచారం మరింతగా అర్థం చేసుకోవాలంటే కింద ఇచ్చిన పట్టికను చూడవచ్చు.