వైద్య విజ్ఞానం

Salt : మీరు ఉప్పును ఎక్కువగా తింటున్నారా ? శ‌రీరం ఈ ల‌క్ష‌ణాల‌ను తెలియ‌జేస్తుంది.. జాగ్ర‌త్త‌..!

Salt : ప్ర‌పంచ‌వ్యాప్తంగా అధిక మందిని ఇబ్బందుల‌కు గురి చేస్తున్న అనారోగ్య స‌మ‌స్య‌ల్లో హైబీపీ ఒక‌టి. ఉప్పును ఎక్కువ‌గా తిన‌డంతోపాటు ప‌లు ఇత‌ర కార‌ణాల వ‌ల్ల కూడా ఈ స‌మ‌స్య వ‌స్తుంటుంది. అందువ‌ల్ల రోజూ ఉప్పు వాడ‌కాన్ని త‌గ్గించాలి. వంట‌ల్లో ఉప్పు ఉండ‌డం అవ‌స‌ర‌మే. కానీ దాన్ని అతిగా తీసుకుంటే మాత్రం ప్ర‌మాదం. మీరు రోజూ ఉప్పును ఎక్కువ‌గా తీసుకుంటే అప్పుడు శ‌రీరంలో సోడియం స్థాయిలు పెరిగిపోతాయి. దీంతో శ‌రీరం మీకు ప‌లు సూచ‌న‌ల‌ను తెలియ‌జేస్తుంది. వాటిని గ‌మ‌నించ‌డం ద్వారా మీ శ‌రీరంలో ఉప్పు ఎక్కువైంద‌ని తెలుసుకోవ‌చ్చు. దీంతో ఉప్పు వాడ‌కాన్ని త‌గ్గించి ఆరోగ్యంగా ఉండ‌వ‌చ్చు. మ‌రి ఉప్పు ఎక్కువైతే శ‌రీరం తెలియ‌జేసే ఆ ల‌క్ష‌ణాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందామా..!

your body shows these signs if you take high amount of salt everyday

1. రోజూ ఉప్పును అధికంగా తీసుకుంటే శ‌రీరంలో సోడియం లెవ‌ల్స్ పెరిగిపోతాయి. దీంతో ఆ సోడియంను బ‌య‌ట‌కు పంపేందుకు కిడ్నీలు శ్ర‌మిస్తాయి. ఇందుకు నీళ్లు ఎక్కువ‌గా అవ‌స‌రం అవుతాయి. ఈ క్ర‌మంలో శ‌రీరం త‌న‌కు నీటిని కావాల‌ని దాహం రూపంలో తెలియ‌జేస్తుంది. దాహం ఎక్కువ‌గా అవుతుంటే అది షుగ‌ర్ వ‌ల్ల అయినా లేదా ఉప్పును ఎక్కువ‌గా తిన‌డం వ‌ల్ల అయినా అయి ఉంటుంది. మీకు షుగ‌ర్ లేక‌పోతే.. దాహం ఎక్కువ‌గా అవుతుంటే అది ఉప్పును ఎక్కువ‌గా తిన‌డం వ‌ల్లే వ‌చ్చింద‌ని అర్థం చేసుకోవాలి. దీంతో ఉప్పు వాడ‌కాన్ని త‌గ్గించాలి. ఈ క్ర‌మంలో స‌హ‌జంగానే దాహం స‌మ‌స్య కూడా త‌గ్గుతుంది.

2. రోజూ ఉప్పును ఎక్కువ‌గా తీసుకుంటే శ‌రీరం వాపుల‌కు గుర‌వుతుంది. ఈ ల‌క్ష‌ణం క‌నిపిస్తే ఉప్పును అధికంగా తింటున్నారేమె చెక్ చేసుకోవాలి. అధికంగా తింటే ఉప్పు వాడ‌కాన్ని త‌గ్గించాలి.

3. ఉప్పును అధికంగా తిన‌డం వ‌ల్ల త‌ల‌నొప్పి బాగా వ‌స్తుంది. అందువ‌ల్ల త‌ర‌చూ త‌ల‌నొప్పి వ‌స్తుంటే అది అధిక ఉప్పు వాడ‌కం వ‌ల్ల వ‌చ్చిందేమో చెక్ చేసుకోవాలి. అవ‌స‌రం అయితే ఉప్పును తీసుకోవ‌డం త‌గ్గించాలి. దీంతో త‌ల‌నొప్పి కూడా త‌గ్గుతుంది.

4. ఉప్పును ఎక్కువ‌గా తిన‌డం వ‌ల్ల శ‌రీరంలో సోడియం స్థాయిలు పెరిగి ఎముక‌లు బ‌ల‌హీనంగా మారుతుంటాయి. దీంతో ఎముక‌లు నొప్పిగా ఉంటాయి. ఇలా గ‌న‌క జ‌రిగితే ఉప్పు వాడ‌కాన్ని తగ్గించాల్సిందే. దీంతో ఆయా నొప్పులు త‌గ్గిపోతాయి.

అయితే ఉప్పు వాడ‌కాన్ని త‌గ్గించినా ఆయా స‌మ‌స్య‌లు త‌గ్గ‌క‌పోతే వెంట‌నే డాక్ట‌ర్‌ను సంప్ర‌దించి చికిత్స తీసుకోవాలి. ఇక ఒక వ్య‌క్తి రోజుకు 2,300 మిల్లీగ్రాముల వ‌ర‌కు ఉప్పును తిన‌వ‌చ్చు. అదే హైబీపీ ఉన్న‌వారు అయితే రోజుకు 1500 మిల్లీగ్రాముల మోతాదులో మాత్ర‌మే ఉప్పును తీసుకోవాలి. లేదంటే స్ట్రోక్స్ వ‌చ్చి ప‌రిస్థితులు ప్రాణాంత‌కంగా మారుతాయి. క‌నుక ఉప్పును రోజూ త‌క్కువ‌గా తీసుకోవ‌డ‌మే మంచిది..!

Share
Admin

Recent Posts