వ్యాయామం

మోకాళ్ల వ‌ద్ద కొవ్వు పేరుకుపోతే స‌మ‌స్య‌లు వ‌స్తాయి.. ఆ కొవ్వును క‌రిగించేందుకు ఈ సుల‌భ‌మైన వ్యాయామాలు చేయండి..!

మ‌న శ‌రీరంలో స‌హ‌జంగానే అనేక చోట్ల కొవ్వు ఎక్కువ‌గా పేరుకుపోతుంటుంది. అందువ‌ల్ల ఒక్కో భాగానికి వ్యాయామం అవ‌స‌రం అవుతుంది. మ‌నం చేసే భిన్న ర‌కాల వ్యాయామాలు మ‌న శ‌రీరంలోని కొవ్వును క‌రిగించేందుకు స‌హాయ ప‌డ‌తాయి. అయితే మోకాళ్ల వ‌ద్ద కూడా కొవ్వు చేరుతుంది. దీంతో అనారోగ్య స‌మ‌స్య‌లు వ‌స్తాయి. అలా జ‌ర‌గ‌కుండా ఉండాల‌న్నా, మోకాళ్ల వ‌ద్ద చేరిన కొవ్వును క‌రిగించాల‌న్నా.. అందుకు కింద తెలిపిన వ్యాయామాలు ఎంత‌గానో తోడ్ప‌డుతాయి. మ‌రి ఆ వ్యాయామాలు ఏమిటంటే..

do these simple exercises daily to reduce fat on knees

1. ర‌న్నింగ్ లేదా జాగింగ్ ఏది చేసినా స‌రే అది క్యాల‌రీలను క‌రిగిస్తుంది. దీంతో కాళ్ల కండ‌రాలు చ‌క్క‌ని ఆకృతిని పొందుతాయి. ఈ వ్యాయామాల వ‌ల్ల మోకాళ్ల వ‌ద్ద ఉండే కొవ్వు కూడా క‌రుగుతుంది.

2. గుంజీలు తీయ‌డం అనేది నిజానికి చాలా మంచి ఎక్స‌ర్‌సైజ్. దీంతో చ‌క్క‌ని వ్యాయామం జ‌రుగుతుంది. ఇది మోకాళ్ల‌కు ఎంత‌గానో మేలు చేస్తుంది. ఆ భాగంలో ఉండే కొవ్వును క‌రిగిస్తుంది. అందుక‌ని రోజూ కొంత స‌మయం పాటు గుంజీలు తీయాలి.

3. రోజూ వాకింగ్ చేయ‌డం వ‌ల్ల ఎన్నో ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయి. శ‌రీరంలోని కొవ్వు క‌రుగుతుంది. ముఖ్యంగా న‌డుం కింది భాగంలోని అవ‌య‌వాల‌కు చ‌క్క‌ని వ్యాయామం అవుతుంది. కండ‌రాలు చ‌క్క‌ని ఆకృతిని పొందుతాయి. వాకింగ్ ఎంతో సుల‌భ‌మైంది. వృద్ధులు కూడా దీన్ని రోజూ చేయ‌వ‌చ్చు. దీని వ‌ల్ల మోకాళ్ల వ‌ద్ద ఉండే కొవ్వును క‌రిగించుకోవ‌చ్చు. మోకాళ్లు ఆరోగ్యంగా ఉంటాయి. నొప్పులు త‌గ్గుతాయి.

4. చిత్రంలో చూపిన‌ట్లుగా ఒక మోకాలిని వంచి రెండో మోకాలుని నేల‌పై ఉంచాలి. త‌రువాత ఇంకో కాలుతో కూడా ఇలా చేయాలి. ఈ వ్యాయామాన్ని LUNGES అంటారు. దీని వ‌ల్ల కూడా మోకాళ్లు ఆరోగ్యంగా ఉంటాయి. నొప్పుల‌ను త‌గ్గించుకోవ‌చ్చు. అక్క‌డ ఉండే కొవ్వు క‌రుగుతుంది.

5. జంపింగ్ రోప్స్ లేదా స్కిప్పింగ్ చేయ‌డం వ‌ల్ల కూడా మోకాళ్ల‌ను ఆరోగ్యంగా ఉంచుకోవ‌చ్చు. దీని వ‌ల్ల శ‌రీరానికి చ‌క్క‌ని వ్యాయామం అవుతుంది. మోకాళ్లు స‌హా న‌డుం కింది భాగంలో ఉండే అన్ని అవ‌యవాల‌కు చ‌క్క‌ని వ్యాయామం అవుతుంది. ఆయా భాగాల్లోని కొవ్వు క‌రుగుతుంది. నొప్పులు త‌గ్గుతాయి.

ఎప్ప‌టిక‌ప్పుడు అప్‌డేట్స్ కోసం టెలిగ్రామ్‌లో మ‌మ్మ‌ల్ని ఫాలో అవ్వండి: Ayurvedam365

Admin

Recent Posts