mythology

న‌ర‌సింహ అవ‌తారం ఎలా ఏర్ప‌డిందో తెలుసా..? ఆయ‌న‌ను ఎలా పూజించాలంటే..?

<p style&equals;"text-align&colon; justify&semi;">నారసింహడు అంటె తెలియని హిందువులు ఉండరు&period; దశావతారాల్లో అత్యంత ఉగ్రరూపంతో కన్పించే మూర్తి నారసింహ్మమూర్తి&period; విష్ణుమూర్తి దశావతారాల్లో నాల్గో అవతారం నరసింహ్మ అవతారం&period; స్వామి జయంతిని ఏటా వైశాఖ శుక్ల చతుర్దశినాడు జరుపుకొంటారు&period; ఈ రోజున స్వామి హిరణ్యకశ్యపుడిని సంహరించి ధర్మాన్ని నిలబెట్టాడు&period; కశ్య ప్రజాపతికి భార్య దితి&period; ఆమెకు హిరణ్యాక్షుడు&comma; హిరణ్యకశ్యపుడు అనే కుమారులు ఉన్నారు&period; లోకకళ్యాణార్థమై హిరణ్యాక్షుడుని విష్ణువు సంహరిస్తాడు&period; దీంతో సోదరున్ని చంపాడని విష్ణువుపై హిరణ్యకశ్యపుడు వైరం పెంచుకుంటాడు&period; ఆయన తీవ్రమైన తపస్సు చేసి బ్రహ్మను ప్రతక్ష్యం చేసుకుంటాడు&period; చావులేని వరం కావాలని ప్రార్థిస్తాడు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">కానీ బ్రహ్మ కొన్ని షరతులతో కూడిన ఆ వరాన్ని ప్రసాదిస్తాడు&period; వరం పొందిన హిరణ్యకశ్యపుడు ముల్లోకాలను గడగడలాడిస్తాడు&period; దేవతలను&comma; ఇంద్రుని సైతం ఓడిస్తాడు&period; అదే సమయంలో హిరణ్యకశ్యపుడుకి ఒక మగ సంతానం కలుగుతుంది&period; ఆ బాలుడి పేరు ప్రహ్లాదుడు&period; అతనికి రాక్షస ప్రవృత్తి రాలేదు&period; పరమ విష్ణు భక్తుడుగా ఆ పిల్లవాడు మారుతాడు&period; ఎన్నో రకాలుగా ఆ బాలుడిని మారుద్దామని హిరణ్యకశ్యపుడు ప్రయత్నించి విఫలం అవుతాడు&period; చివరకు సంహరించాలని ప్రయత్నించినా అదికూడా సాధ్యం కాదు&period; చివరగా ఒకరోజు ఆ బాలుడిని పిలిచి నీ విష్ణువు ఎక్కడున్నాడో చెప్పమంటాడు&period; ఇందుగలడు&period; అందులేడు అనుటకు సందేహం లేదు ఎందెందు వెతికినా అందందు ఆ స్వామి గలడు అంటాడు&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-77999 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2025&sol;03&sol;narasimha-swamy&period;jpg" alt&equals;"do you know how narasimha swamy avataram formed " width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">దాంతో ఆగ్రహించిన హిరణ్యకశ్యపుడు ఈ స్తంభంలో చూపించు అని ఆజ్ఞాపించగా ప్రహ్లాదుడు స్వామిని ప్రార్థిస్తాడు&period; అంతే స్వామి ఉగ్రస్వరూపంతో మనషిలా కాకుండా&comma; జంతువులా కాకుండా మనిషి&comma; సింహంల మిళితమైన రూపంతో ఆ స్తంభంలో నుంచి అవతరించి హిరణ్యకశ్యపుడున్ని సంహరిస్తాడు&period; ఆ అవతారమూర్తే నారసింహ అవతారం&period; స్వామి వారికి షోడశోషచార పూజలు&comma; నైవేద్యాలు సమర్పించాలి&period; స్వామి శాంతి కోసం పానకం నివేదించడం ఆనవాయితీ&period; భక్తితో స్వామి లక్ష్మీనారసింహ్మ కరావలంబం&comma; స్తోత్రమ్&comma; అష్టోతరాలతోపాటు లక్ష్మీదేవి అష్టోతరాలను చదువుకోవాలి&period; యాదగిరిగుట్టలోని పంచనారసింహులను&comma; స్తంబాద్రి&comma; ధర్మపురి నరసింహ్మస్వామి&comma; ఆహోబిలం&comma; అంతర్వేది&comma; సింహాద్రి&comma; మంగళగిరి పానకాలస్వామి తదితర పుణ్యక్షేత్రాలను సందర్శించడం ఉత్తమం&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">స్వామి అనుగ్రహం ఉంటే అనారోగ్యాలు దరిచేరవు&comma; అదేవిధంగా భూత&comma; ప్రేత&comma; నిశాచర తదితర దుష్టశక్తుల నివారించగలిగే శక్తి సంపన్నుడు స్వామి&period; ఆయన నామస్మరణను మనసా&comma; వాచా&comma; కర్మణ చేస్తే చాలు ఆయన రక్ష తప్పక లభిస్తుందని పలు గాథలు&comma; పురాణాలు మనకు తెలియజేస్తున్నాయి&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts