83 Movie : బాలీవుడ్ నటుడు రణ్‌వీర్ సింగ్ నటించిన బయోగ్రాఫికల్ స్పోర్ట్స్ డ్రామా 83 మూవీ థియేటర్లలో గతేడాది విడుదలైంది. బయోపిక్ మూవీ కనుక సహజంగానే ఈ సినిమాకు ప్రేక్షకులు, విమర్శకుల ప్రశంసలు దక్కాయి. అయితే ఈ మూవీ ఓటీటీ విడుదల నిరవధికంగా వాయిదా పడింది. ఈ క్రమంలోనే ఈ సినిమా ఓటీటీలో విడుదల కావడంపై నిన్న మొన్నటి వరకు కోర్టులో కేసు విచారణ కొనసాగింది. అయితే ప్రస్తుతం అన్ని అడ్డంకులు తొలగిపోయాయి. దీంతో ఎట్టకేలకు ఈ మూవీ ఓటీటీలో విడుదలైంది.
రణ్‌వీర్ సింగ్ ప్రధాన పాత్రలో నటించిన మాజీ క్రికెటర్ కపిల్ దేవ్ బయోపిక్ 83 మూవీ ప్రస్తుతం ఓటీటీలో స్ట్రీమ్ అవుతోంది. ఈ మూవీకి చెందిన హిందీ, తెలుగు, తమిళం, కన్నడ, మళయాళం భాషల వెర్షన్లను ప్రస్తుతం ఓటీటీలో స్ట్రీమ్ చేస్తున్నారు. ఇక ఈ మూవీని డిస్నీ ప్లస్ హాట్ స్టార్‌లో ప్రస్తుతం వీక్షించవచ్చు.
కాగా ఈ మూవీని ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండానే ఓటీటీలో విడుదల చేశారు. దీంతో ప్రేక్షకులు సడెన్‌గా సర్‌ప్రైజ్ అయ్యారు. ఇక 1983లో భారత క్రికెట్ జట్టు గెలుచుకున్న వరల్డ్ కప్ కథాంశంతో ఈ సినిమాను తెరకెక్కించారు. ఇందులో కపిల్ దేవ్ పాత్రలో రణ్‌వీర్ సింగ్ నటించాడు.