Rashmi Gautam : సోషల్ మీడియాలో రష్మి గౌతమ్ ఎల్లప్పుడూ యాక్టివ్‌గా ఉంటుందనే విషయం తెలిసిందే. ఈమె గతంలో పలు సినిమాల్లో నటించింది. కానీ అవి పెద్దగా విజయం సాధించలేదు. దీంతో ఈమె టీవీ షోలు, ఈవెంట్స్‌కే పరిమితం అవుతోంది. ఇక పలు ప్రత్యేక షోలలోనూ ఈమె పాల్గొంటోంది. అయితే రష్మి గౌతమ్ మూగ జీవాల పట్ల ఎక్కువగా ప్రేమ చూపిస్తుంటుంది. ముఖ్యంగా కుక్కలు అంటే ఆమెకు ఎంతో ఇష్టం. వాటికి ఏం జరిగినా.. ఆమె సహించలేదు.
కాగా హోలీ పండుగ సందర్భంగా రష్మి ఓ విజ్ఞప్తి చేసింది. మూగ జీవాలపై రంగులు చల్లవద్దని, చల్లితే వాటిల్లో ఉండే రసాయనాలు ఆ జీవాలకు హాని కలిగిస్తాయని.. కనుక హోలీ రంగులపై వాటిపై చల్లవద్దని.. ఆమె కోరింది. కానీ ఆమె విజ్ఞప్తిని కొందరు వినిపించుకోలేదు. కొన్ని కుక్కలపై వారు రంగులను చల్లారు.
అయితే ఈ విషయం తెలుసుకున్న రష్మి గౌతమ్ వెంటనే సోషల్ మీడియా సహాయంతో ఆ నిందితులను పట్టిచ్చింది. దీంతో సోషల్ మీడియా పవర్‌కు ఆమె కృతజ్ఞతలు తెలిపింది. మూగజీవాల పట్ల జాలి, దయ చూపించాలని ఎంత చెప్పినా కొందరు వినిపించుకోవడం లేదని.. వారికి కఠినంగా శిక్ష పడాలని ఆమె కోరింది. ఈ క్రమంలోనే ఆమె పోస్టు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.