Chanakya Niti : భారతదేశం యొక్క గొప్ప పండితుడు, ఆర్థికవేత్త, దౌత్యవేత్త మరియు మార్గదర్శకుడు అయిన ఆచార్య చాణక్యుడు మనకు ఎన్నో విషయాలను అందించాడు. ఈయన చెప్పిన విషయాలను పాటించడం వల్ల జీవితంలో సమస్యలు తొలగిపోతాయి. కష్టాల నుండి బయటపడతాము. చాణక్య నీతిని అనుసరించే వారి ముందు శత్రువులు కూడా నిలబడలేరు. ప్రతి సమస్యను అధిగమించి వారు లక్ష్యాన్ని సాధిస్తారు. చాణక్యనీతిని అనుసరించే వారు ఎల్లప్పుడూ విజయవంతంగా, ఆహ్లాదకరంగా, సంపన్నులుగా ఉంటారు. చాణక్య నీతిలో ప్రస్తావించిన విజయాన్ని కలిగించే కొన్ని విషయాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. చాణక్యుడు తననీతి శాస్త్రంలో కొన్ని విషయాల గురించి పేర్కొన్నాడు అవి మట్టిలో ఉన్నప్పటికి వాటి విలువ తగ్గదు. బంగారం, వెండి, వజ్రాలు వంటివి మట్టిలో, మురికిలో ఉన్నప్పటికి వాటిని తీయడానికి వెనుకాడరు.
ఎందుకంటే వాటి విలువ మట్టిలో ఉన్నప్పటికి ఏ మాత్రం తగ్గదు. అంతేకాకుండా ఇవి మనల్ని ధనవంతుల్ని చేస్తాయి. అలాగే మనలో దాగి ఉన్న ప్రత్యేకతను, నైపుణ్యాన్ని బయటకు తీసి మనల్ని మనం విజయపథంలో సాగేలా చూసుకోవాలి. అదేవిధంగా చదువుకున్న, సంసార్కవంతమైన అమ్మాయి కోడలిగా ఉన్న ఇల్లు ఎప్పుడూ స్వర్గంగా ఉంటుందని చాణక్య నీతి చెబుతుంది. చక్కటి అమ్మాయిని అందరూ కూడా ఇంటి కోడలిగా చేసుకోవాలని చూస్తూ ఉంటారు. చెడు వ్యక్తులతో ఉన్నప్పటికి ఇంట్లో అమ్మాయి మర్యాదగా ఉంటే ఆ కుటుంబం సంతోషంగా ఉండడంతో పాటు తర తరాల పాటు గౌరవంగా ఉంటుంది. చెడు వ్యక్తులతో ఉన్నప్పటికి మనం మంచిగా ఉంటే మనకు ఎల్లప్పుడూ మంచే జరుగుతుంది. అలాగే జీవితాన్ని నడపడానికి డబ్బు చాలా అవసరం. డబ్బు లక్ష్మీ దేవికి సంబంధించినది.
కనుక డబ్బును ఎల్లప్పుడూ అవమానించకూడదు. డబ్బును ఎప్పుడూ కూడా గౌరవించాలి. అదేవిధంగా ఆచార్య చాణక్యుడి ప్రకారం ప్రతి వ్యక్తిలో మంచి, చెడు రెండూ ఉంటాయి. చెడ్డ వ్యక్తుల్లో కూడా మంచి ఉంటుంది. కనుక చెడ్డ వ్యక్తుల్లో ఉండే మంచిని నేర్చుకోవడానికి కూడా మనం ఎప్పుడూ వెనకూడదు. జీవితంలో ఎల్లప్పుడూ మంచి విషయాలను మంచి అలవాట్లను నేర్చుకుంటూ ఉండాలి. ఇవి మనకు జీవితంలో ఎంతో ప్రయోజనాన్ని చేకూరుస్తాయి. ఈవిధంగా చాణక్యుడు చెప్పిన ఈ విషయాలను పాటించడం వల్ల మనం మలినంగా, చెడు మార్గంలో ఉన్నప్పటికి మంచిగా మారవచ్చు. అలాగే మన జీవితాన్ని విజయపథంలో నడిపించవచ్చు.