వినోదం

Ala Vaikunthapurramuloo : అల వైకుంఠ‌పుర‌ములో మూవీలో చూపించిన ఈ ఇల్లు ఎవ‌రిదో తెలుసా ?

Ala Vaikunthapurramuloo : అల్లు అర్జున్ త‌న సినిమా కెరీర్‌లో ఎన్నో వైవిధ్య‌భ‌రిత‌మైన మూవీల‌ను చేశాడు. వాటిల్లో అల వైకుంఠ‌పుర‌ములో మూవీ ఒక‌టి. ఈ మూవీ 2020లో సంక్రాంతికి రిలీజ్ అయింది. భారీ బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ అయింది. ముఖ్యంగా ఇందులోని పాట‌ల‌కు ప్రేక్ష‌కులు ఫిదా అయ్యారు. ఇక ఈ మూవీలో చాలా వ‌ర‌కు క‌థ ఒక పెద్దింట్లో కొన‌సాగుతుంది. అందులో ట‌బు అల్లు అర్జున్ త‌ల్లిగా యాక్ట్ చేసింది. ఇక వారి ఇంటి పేరే వైకుంఠ పురం. అయితే వాస్త‌వానికి ఈ ఇల్లు ఎవ‌రిది.. అనే విష‌యం చాలా మందికి తెలియ‌దు.

అల వైకుంఠ‌పురములో మూవీలో చూపించిన ఆ పెద్ద ఇల్లు ప్ర‌ముఖ న్యూస్ చాన‌ల్ ఎన్‌టీవీ చైర్మ‌న్ న‌రేంద్ర చౌద‌రి కుమార్తె ర‌చ‌న చౌద‌రి భ‌ర్త‌ది. ఇక ఈ ఇంటి విలువ దాదాపుగా రూ.300 కోట్లు. ఈ ధ‌ర అప్ప‌ట్లో. ఇప్పుడు 2 ఏళ్లు గ‌డిచిపోయాయి క‌నుక ధ‌ర ఇంకా పెరిగే ఉంటుంది. ఈ మూవీలో చాలా వ‌ర‌కు భాగాన్ని ఈ ఇంట్లోనే చిత్రీక‌రించారు.

Ala Vaikunthapurramuloo house do you know whose it is

సాధార‌ణంగా హైద‌రాబాద్‌లో ఇళ్ల ధ‌ర‌లు ఇలాగే ఉంటాయి. ఈ క్ర‌మంలోనే న‌గ‌రంలో ఉన్న అత్యంత ఖ‌రీదైన ఇళ్ల‌లో ఇదొక‌టని చెప్ప‌వ‌చ్చు. ఇక ఈ ఇంట్లో షూటింగ్ జ‌రిగిన‌ప్పుడు అల్లు అర్జున్ ఈ ఇంటిని చూసి చాలా ఇష్ట‌ప‌డ్డాడ‌ట‌. ఇలాగే ఒక ఇల్లును క‌ట్టుకోవాల‌ని కూడా అనుకున్నాడ‌ట‌. మ‌రి ఆయ‌న క‌ల నెర‌వేరిందో లేదో తెలియ‌దు కానీ.. అల వైకుంఠ‌పుర‌ములో మూవీ మాత్రం బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ అయింది. అల్లు అర్జున్ కెరీర్‌లో బిగ్గెస్ట్ హిట్‌ల‌లో ఈ మూవీ ఒక‌టిగా నిలిచింది.

Admin

Recent Posts