Allu Arjun : సినిమా ఇండస్ట్రీలో కేవలం హీరోలు మాత్రమే కాదు.. వారి భార్యలు కూడా పాపులారిటీ సంపాదిస్తుంటారు. దీంతో వారికి కూడా సోషల్ మీడియాలో ఫ్యాన్స్ అవుతుంటారు. అలాంటి వారిలో అల్లు అర్జున్ భార్య స్నేహా రెడ్డి ఒకరు. ఈమె సోషల్ మీడియాలో ఎల్లప్పుడూ యాక్టివ్‌గా ఉంటుంది. తమ కుటుంబానికి చెందిన అనేక విషయాలను ఆమె షేర్ చేసుకుంటూ.. పోస్టులు పెడుతుంటుంది. ఇక తాజాగా ఈమెకు చెందిన ఫొటోలను అల్లు అర్జున్ షేర్ చేశారు.
తన భార్య స్నేహా రెడ్డితో కలిసి డిన్నర్ చేసిన ఫొటోలను అల్లు అర్జున్ షేర్ చేశారు. అంతేకాదు.. ఆ ఫొటోకు ఆయన ఓ కాప్షన్ కూడా పెట్టారు. ఇక్కడ ఎవరో సంతోషంగా ఉన్నారు..? అని కామెంట్ చేశారు. ఈ క్రమంలోనే అల్లు అర్జున్ షేర్ చేసిన ఫొటో వైరల్ గా మారింది. చూస్తుంటే వీరిద్దరూ ప్రేమికుల దినోత్సవాన్ని ఆలస్యంగా జరుపుకున్నారని తెలుస్తోంది.
అల్లు అర్జున్ తనకు కొంచెం సమయం లభించినా చాలు ఫ్యామిలీతో కలిసి ఎంజాయ్ చేస్తుంటారు. వెకేషన్స్‌కు వెళ్లి వస్తుంటారు. ఇక అల్లు అర్జున్ ప్రస్తుతం పుష్ప సినిమా రెండో భాగంలో నటించనున్నారు. ఈ మధ్యే ఈయన దుబాయ్‌కు వెళ్లి రాగా.. త్వరలోనే ఈ మూవీ షూటింగ్ ప్రారంభం కానుంది.