Aloo Capsicum Fry : ఆలు, క్యాప్సికం క‌లిపి చేసే ఫ్రై.. రుచి చూస్తే.. మొత్తం తినేస్తారు..

Aloo Capsicum Fry : బంగాళాదుంప‌ల‌తో మ‌నం ర‌క‌ర‌కాల వంట‌ల‌ను త‌యారు చేస్తూ ఉంటాం. బంగాళాదుంప‌ల‌తో చేసే వంట‌కాల‌ను తిన‌డం వ‌ల్ల రుచితో పాటు ఆరోగ్యాన్ని కూడా పొంద‌వ‌చ్చు. ఈ బంగాళాదుంప‌ల‌తో మ‌నం ఇత‌ర కూర‌గాయ‌ల‌ను క‌లిపి కూడా వండుతూ ఉంటాం. అందులో భాగంగా ఎంతో రుచిగా ఉండే ఆలూ క్యాప్సికం ఫ్రైను ఎలా త‌యారు చేసుకోవాలి.. తయారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు ఏమిటి.. అన్న వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం.

ఆలూ క్యాప్సికం ఫ్రై త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు..

ఉడికించిన బంగాళాదుంప‌లు – అర కిలో, త‌రిగిన క్యాప్సికం – పావు కిలో, స‌న్న‌గా పొడుగ్గా త‌రిగిన ఉల్లిపాయ‌లు – 2, త‌రిగిన ప‌చ్చిమిర్చి – 4, ల‌వంగాలు – 4, దాల్చిన చెక్క – ఒక ఇంచు ముక్క‌, తాళింపు గింజ‌లు – ఒక టేబుల్ స్పూన్, ఎండుమిర్చి – 2, ప‌సుపు – అర టీ స్పూన్, ఉప్పు – త‌గినంత‌, వెల్లుల్లి రెబ్బ‌లు – 5, నూనె – 2 టేబుల్ స్పూన్స్, క‌రివేపాకు – రెండు రెమ్మ‌లు.

Aloo Capsicum Fry recipe in telugu best for chapati or rice
Aloo Capsicum Fry

ఆలూ క్యాప్సికం ఫ్రై త‌యారీ విధానం..

ముందుగా ల‌వంగాల‌ను, దాల్చిన చెక్క‌ను పొడిగా చేసుకుని పెట్టుకోవాలి. త‌రువాత ఒక క‌ళాయిలో నూనె వేసి వేడి చేయాలి. నూనె వేడ‌య్యాక తాళింపు గింజ‌లు, ఎండుమిర్చి, క‌రివేపాకు వేసి వేయించుకోవాలి. త‌రువాత ప‌చ్చిమిర్చి, ఉల్లిపాయ ముక్క‌లు, వెల్లుల్లి రెబ్బ‌లు వేసి వేయించుకోవాలి. ఉల్లిపాయ ముక్క‌లు వేగిన త‌రువాత క్యాప్సికం ముక్క‌ల‌ను వేసి క‌ల‌పాలి. త‌రువాత దీనిపై మూత పెట్టి క్యాప్సికం ముక్క‌లు మెత్త‌గా అయ్యే వ‌ర‌కు వేయించుకోవాలి. క్యాప్సికం ముక్క‌లు వేగిన త‌రువాత ఉప్పు, ప‌సుపు, కారం వేసి ఒక నిమిషం పాటు క‌లుపుతూ వేయించుకోవాలి.

త‌రువాత ఉడికించిన బంగాళాదుంప‌ల‌ను ముక్క‌లుగా చేసి వేసుకుని క‌లుపుకోవాలి. త‌రువాత దీనిపై మూత పెట్టి 2 నిమిషాల పాటు మ‌గ్గించాలి. త‌రువాత దాల్చిన చెక్క‌, ల‌వంగాల పొడి వేసి క‌లుపుకోవాలి. దీనిని ఒక నిమిషం పాటు వేయించి స్ట‌వ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల ఎంతో రుచిగా ఉండే ఆలూ క్యాప్సికం ఫ్రై త‌యార‌వుతుంది. దీనిని అన్నం,చ‌పాతీతో క‌లిపి తింటే చాలా రుచిగా ఉంటుంది.

Share
D

Recent Posts