Amazon Mobile Savings Days Sale : అమెజాన్ లో మొబైల్ సేవింగ్స్ డేస్ సేల్‌.. స్మార్ట్ ఫోన్ల‌పై భారీ త‌గ్గింపు ధ‌ర‌లు..!

Amazon Mobile Savings Days Sale : ఈ-కామ‌ర్స్ సంస్థ అమెజాన్ త‌న సైట్‌లో మొబైల్ సేవింగ్స్ డేస్ పేరిట ఓ ప్ర‌త్యేక సేల్‌ను ప్రారంభించింది. ఈ సేల్ ఇప్ప‌టికే ప్రారంభం కాగా ఈ నెల 19వ తేదీ వ‌ర‌కు కొన‌సాగ‌నుంది. ఇందులో భాగంగా అనేక కంపెనీల‌కు చెందిన స్మార్ట్ ఫోన్ల‌పై భారీ త‌గ్గింపు ధ‌ర‌ల‌ను అందిస్తున్నారు. ఈ సేల్‌లో శాంసంగ్‌, వ‌న్ ప్ల‌స్‌, షియోమీ, రియ‌ల్‌మి, ఒప్పో, ఐక్యూ వంటి కంపెనీల‌కు చెందిన ఫోన్ల‌పై ఏకంగా 40 శాతం త‌గ్గింపు ధ‌ర‌ల‌ను అందిస్తున్నారు.

Amazon Mobile Savings Days Sale huge discounts on smart phones
Amazon Mobile Savings Days Sale

ఈ సేల్‌లో వన్ ప్ల‌స్ నార్డ్ సీఈ 2 5జి, వ‌న్‌ప్ల‌స్ నార్డ్ 2 5జి, వ‌న్‌ప్ల‌స్ 9ఆర్‌టీ, శాంసంగ్ గెలాక్సీ ఎం32 5జి, ఎంఐ 11ఎక్స్, షియోమీ 11 లైట్ ఎన్ఈ 5జి, రియ‌ల్‌మి నోట్ 11టి 5జి, రెడ్‌మీ నోట్ 10ఎస్‌, రెడ్‌మీ నోట్ 10టి 5జి, ఐక్యూ 9 ప్రొ 5జి, ఐక్యూ 9 ఎస్ఈ ఫోన్ల‌పై త‌గ్గింపు ధ‌ర‌ల‌ను పొంద‌వ‌చ్చు.

సేల్ లో అమెజాన్ ప్రైమ్ మెంబ‌ర్లకు ప్ర‌త్యేకమైన ఆఫ‌ర్ల‌ను అందిస్తున్నారు. హెచ్‌డీఎఫ్‌సీ కార్డుల‌తో ఫోన్‌ను కొనుగోలు చేస్తే అద‌నంగా 3 నెల‌ల నో కాస్ట్ ఈఎంఐ స‌దుపాయాన్ని అందిస్తున్నారు. ఇక ఈ సేల్‌లో ప‌వ‌ర్ బ్యాంకుల‌పై 60 శాతం డిస్కౌంట్ ల‌భిస్తుంది. ఇలా ఎన్నో ఆఫర్ల‌ను ఈ సేల్‌లో అందిస్తున్నారు.

Share
Editor

Recent Posts