Phlegm : ఇలా చేస్తే.. ఊపిరితిత్తులు, ముక్కులో ఉండే క‌ఫం మొత్తం ఒకే సారి బ‌య‌ట‌కు వ‌స్తుంది..!

Phlegm : చ‌ల్ల‌ని ప‌దార్థాల‌ను అధికంగా తీసుకోవడం లేదా శ్వాస‌కోశ స‌మ‌స్య‌లు.. సీజ‌నల్ వ్యాధుల వ‌ల్ల మ‌న ఊపిరితిత్తుల్లో క‌ఫం ఎక్కువ‌గా చేరుతుంది. దీంతో మ‌నం ద‌గ్గిన‌ప్పుడు, తుమ్మిన‌ప్పుడు అది నోరు, ముక్కు ద్వారా బ‌య‌ట ప‌డుతుంది. కానీ అది ఒకేసారి మొత్తం బ‌య‌ట‌కు రాదు. దీంతో ఇబ్బందిగా అనిపిస్తుంటుంది. ఇక క‌ఫం అధికంగా ఉండ‌డం వల్ల ముక్కు దిబ్బ‌డ స‌మ‌స్య కూడా వ‌స్తుంది. కానీ కింద తెలిపిన విధంగా చిట్కాను పాటిస్తే.. శ‌రీరంలో ఉండే క‌ఫం మొత్తం దెబ్బ‌కు బ‌య‌ట‌కు వ‌స్తుంది. దీంతో శ్వాస స‌రిగ్గా ఆడుతుంది. శ్వాస కోశ స‌మ‌స్య‌ల నుంచి ఉప‌శ‌మ‌నం ల‌భిస్తుంది. మ‌రి అందుకు ఏం చేయాలంటే..

follow this home remedy for Phlegm
Phlegm

కాక‌ర‌కాయ‌ను స‌హ‌జంగానే చాలా మంది తినేందుకు ఇష్ట‌ప‌డ‌రు. ఇది చేదుగా ఉంటుంది. కాబ‌ట్టి దీన్ని చాలా మంది తిన‌రు. కొంద‌రు దీన్ని తినాల‌ని అనుకుంటారు. కానీ చేదు కార‌ణంగా తిన‌లేక‌పోతుంటారు. అయితే చేదు అని చెప్పి కాక‌ర‌కాయ‌ను తిన‌కుండా ప‌క్క‌న పెడితే ఎన్నో ప్ర‌యోజ‌నాల‌ను కోల్పోతారు. అవును.. ఎందుకంటే ఇది శ్వాస‌కోశ స‌మ‌స్య‌ల‌ను త‌గ్గించ‌డంలో అద్భుతంగా ప‌నిచేస్తుంది. కనుక చేదుగా ఉన్నా స‌రే.. కాక‌ర‌కాయ‌ల‌ను తినాల్సిందే.

శ‌రీరంలో.. ముఖ్యంగా ఊపిరితిత్తుల్లో, ముక్కులో క‌ఫం అధికంగా ఉన్న‌వారు.. రోజుకు 3 పూట‌లా కాక‌ర‌కాయ‌ల‌ను ఆహారంలో భాగం చేసుకోవాలి. ఉద‌యం ప‌ర‌గ‌డుపున 30 ఎంఎల్ మోతాదులో కాక‌ర‌కాయ జ్యూస్‌ను తాగాలి. త‌రువాత మ‌ధ్యాహ్నం, రాత్రి భోజ‌నంలోనూ కాక‌ర‌కాయ‌ల‌ను తినాలి. ఏదో ఒక రూపంలో వీటిని తీసుకున్నా చాలు.. శ్వాస‌కోశ స‌మ‌స్య‌ల నుంచి ఉప‌శ‌మ‌నం ల‌భిస్తుంది.

కాక‌ర‌కాయ‌ల‌ను రోజుకు 3 పూట‌లా ఒక రోజు తింటే చాలు.. ఊపిరితిత్తులు, ముక్కులో ఉండే క‌ఫం అంతా దెబ్బ‌కు బ‌య‌ట‌కు పోతుంది. అయితే మొద‌టి రోజుతో స‌మ‌స్య త‌గ్గ‌క‌పోతే రెండో రోజు కేవ‌లం ఉద‌యం ప‌ర‌గ‌డుపున జ్యూస్‌ను తాగితే చాలు. ఇలా వ‌రుస‌గా 5 రోజుల పాటు చేస్తే దెబ్బ‌కు క‌ఫం మొత్తం బ‌య‌ట‌కు వ‌చ్చేస్తుంది. దీంతో శ్వాస‌కోశ స‌మ‌స్య‌లు త‌గ్గుతాయి. ముఖ్యంగా ముక్కు దిబ్బ‌డ నుంచి ఉప‌శ‌మ‌నం ల‌భిస్తుంది. గాలి స‌రిగ్గా ఆడుతుంది. ద‌గ్గు, జ‌లుబు కూడా త‌గ్గిపోతాయి.

Share
Admin

Recent Posts