PV Sindhu : ఈ మధ్య కాలంలో క్రీడాకారులు చాలా మంది సినిమా పాటలకు డ్యాన్స్‌లు చేస్తూ తమ సరదాను తీర్చుకుంటున్నారు. ముఖ్యంగా క్రికెటర్లు ఎక్కువగా ఇలా చేస్తున్నారు. అయితే ఆ జాబితాలోకి ఇండియన్ బ్యాడ్మింటన్ స్టార్ ప్లేయర్ పీవీ సింధు కూడా వచ్చి చేరింది. ఈమె ఓ పాటకు తాజాగా డ్యాన్స్ చేసి అలరించింది.
పీవీ సింధు ఈ మధ్యే కచ్చా బాదమ్ అనే పాపులర్ పాటకు డ్యాన్స్ చేసి అలరించింది. ఇక తాజాగా మయకిర్రియె అనే తమిళ పాటకు సింధు డ్యాన్స్ చేసింది. దీన్ని మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచందర్ ఆలపించారు. ఈ క్రమంలోనే సింధు ఈ పాటకు అద్భుతంగా డ్యాన్స్ చేసింది.
కాగా సింధు ఈ డ్యాన్స్‌కు చెందిన వీడియోను తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేసింది. దీంతో ఈ వీడియో వైరల్‌గా మారింది. ఇక ఈ పాటకు ఇప్పటికే 10 లక్షలకు పైగా వ్యూస్ వచ్చాయి. 2 లక్షలకు పైగా లైక్స్ వచ్చాయి. ఈ వీడియోను ప్రస్తుతం చాలా మంది చూసి ఎంజాయ్ చేస్తున్నారు. సింధు చాలా బాగా డ్యాన్స్ చేసిందని.. కామెంట్లు పెడుతున్నారు.