Apalu : ప‌ప్పు అవ‌స‌రం లేదు.. మెత్త‌ని దూదిలాంటి ఇవి రెడీ అయిపోతాయి..!

Apalu : ఆపాలు.. కేర‌ళ వంట‌క‌మైన ఈ ఆపాలు చాలా రుచిగా, నోట్లో వేసుకుంటే క‌రిగిపోయేంత మెత్త‌గా ఉంటాయి. వెజ్, నాన్ వెజ్ వేటితో తిన్నా కూడా ఈ ఆపాలు చాలా చ‌క్క‌గా ఉంటాయి. వీటిని త‌యారు చేయ‌డం కూడా చాలా సుల‌భం. అల్పాహారంగా తీసుకోవ‌డానికి ఇవి చాలా చ‌క్క‌గా ఉంటాయి. త‌రుచూ ఒకేర‌కం వంట‌కాలు కాకుండా ఇలా వెరైటీగా ఆపాల‌ను కూడా త‌యారు చేసుకుని తిన‌వ‌చ్చు. రుచిగా, మృదువుగా ఉండే ఈ ఆపాల‌ను ఎలా త‌యారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.

ఆపాలు త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు..

బియ్యం – రెండు గ్లాసులు, ప‌చ్చి కొబ్బ‌రి తురుము – ఒక గ్లాస్, అన్నం – ఒక గ్లాస్, ఉప్పు- త‌గినంత‌, వంట‌సోడా – రెండు చిటికెలు.

Apalu recipe in telugu make in this method
Apalu

ఆపాలు త‌యారీ విధానం..

ముందుగా బియ్యాన్ని శుభ్రంగా క‌డిగి 5 గంట‌ల పాటు నాన‌బెట్టాలి. త‌రువాత ఈ బియ్యాన్ని జార్ లోకి తీసుకోవాలి. ఇందులోనే ప‌చ్చి కొబ్బ‌రి తురుము, అన్నం వేసి కొద్ది కొద్దిగా చ‌ల్ల‌టి నీటిని పోస్తూ మెత్త‌గా మిక్సీ ప‌ట్టుకోవాలి. త‌రువాత పిండిని గిన్నెలోకి తీసుకుని మూత పెట్టి రాత్రంతా పులియ‌బెట్టాలి. పిండి చ‌క్క‌గా పులిసిన త‌రువాత ఇందులో ఉప్పు, వంట‌సోడా వేసి క‌ల‌పాలి. త‌రువాత స్ట‌వ్ మీద ఆపాల పెనాని ఉంచి వేడి చేయాలి. త‌రువాత ఇందులో నూనె వేసి టిఫ్యూ పేప‌ర్ తో తుడుచుకోవాలి.

త‌రువాత క‌ళాయిలో పిండిని వేసి పిండి అంతా స్ప్రెడ్ అయ్యేలా క‌ళాయిని చుట్టూ తుప్పుకోవాలి. త‌రువాత మూత పెట్టి 2 నిమిషాల వేయించాలి. త‌రువాత దీనిని వేడి వేడిగా ప్లేట్ లోకి తీసుకుని స‌ర్వ్ చేసుకోవాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల ఎంతో రుచిగా ఉండే ఆపాలు త‌యార‌వుతాయి. ఆపాల పెనం లేని వారు చిన్న‌గా గుండ్రంగా ఉండే క‌ళాయిలో కూడా వీటిని త‌యారు చేసుకోవ‌చ్చు. ఈ ఆపాల‌ను వెజ్, నాన్ వెజ్ వంట‌కాల‌తో క‌లిపి తింటే చాలా రుచిగా ఉంటుంది.

D

Recent Posts