ASUS Vivobook 13 Slate : అసుస్ నుంచి వివోబుక్ 13 స్లేట్ ల్యాప్‌టాప్‌.. ధ‌ర రూ.45వేలు..!

ASUS Vivobook 13 Slate : అసుస్ సంస్థ వివోబుక్ 13 స్లేట్ పేరిట ఓ నూత‌న 2 ఇన్ 1 కన్వ‌ర్ట‌బుల్ ల్యాప్‌టాప్‌ను విడుద‌ల చేసింది. ప్ర‌పంచంలోనే మొదటి 13.3 ఇంచుల ఓలెడ్ విండోస్ డిటాచ‌బుల్ ల్యాప్‌టాప్ ఇదే కావ‌డం విశేషం. దీనిక అసుస్ పెన్ 2.0 స్టైల‌స్‌ను కూడా అందిస్తున్నారు. దీని హింజెస్ 170 డిగ్రీల యాంగిల్‌లో రొటేట్ అవుతాయి.

ASUS Vivobook 13 Slate  2 in 1 laptop launched
ASUS Vivobook 13 Slate

అసుస్ పెన్ 2.0కు యూఎస్‌బీ టైప్ సి పోర్ట్‌ను అందిస్తున్నారు. ఇది హైడ్ అయి ఉంటుంది. ఈ ల్యాప్‌టాప్‌కు ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ ఉంది. అందువ‌ల్ల 30 నిమిషాల్లోనే 100 శాతం చార్జింగ్ అవుతుంది. ఒక‌సారి ఫుల్ చార్జింగ్ చేస్తే 140 గంట‌ల వ‌ర‌కు బ్యాట‌రీ బ్యాక‌ప్ ల‌భిస్తుంది. దీంట్లో డాల్బీ అట్మోస్ స‌పోర్ట్‌ను అందిస్తున్నారు. అందువ‌ల్ల సౌండ్ క్వాలిటీ బాగుంటుంది. ఈ ల్యాప్ టాప్‌లో క్వాడ్‌కోర్ పెంటియ‌మ్ సిల్వ‌ర్ ఎన్‌6000 చిప్‌ను ఏర్పాటు చేశారు.

అసుస్ వివోబుక్ 13 స్లేట్ ల్యాప్‌టాప్‌లో.. 13.3 ఇంచుల ఫుల్ హెచ్‌డీ ఓలెడ్ డిస్‌ప్లేను ఏర్పాటు చేశారు. ఇంటెల్ క్వాడ్ కోర్ పెంటియ‌మ్ సిల్వ‌ర్ ఎన్‌6000 ప్రాసెస‌ర్‌ను ఏర్పాటు చేశారు. ఇంటెల్ యూహెచ్‌డీ గ్రాఫిక్స్ ల‌భిస్తున్నాయి. 8జీబీ ర్యామ్‌ను ఏర్పాటు చేశారు. 128/256 జీబీ ఎస్ఎస్‌డీ ల‌భిస్తుంది. విండోస్ 11 హోమ్ ఆప‌రేటింగ్ సిస్ట‌మ్‌ను ఏర్పాటు చేశారు. వెనుక వైపు 13 మెగాపిక్స‌ల్ కెమెరా, ముందువైపు 5 మెగాపిక్స‌ల్ కెమెరా ఉన్నాయి.

ఈ ల్యాప్‌టాప్‌లో బ్లూటూత్ 5.2, యూఎస్‌బీ టైప్ సి, మైక్రో ఎస్‌డీ కార్డు రీడ‌ర్‌, డిటాచ‌బుల్ కీబోర్డ్‌, ఫింగ‌ర్ ప్రింట్ సెన్సార్‌, స్టైల‌స్ (ఆప్ష‌నల్‌), 140 గంట‌ల బ్యాట‌రీ బ్యాక‌ప్‌, క్వాడ్ స్టీరియో స్పీక‌ర్స్‌, డాల్బీ అట్మోస్‌, ఫాస్ట్ చార్జింగ్.. ఫీచ‌ర్ల‌ను అందిస్తున్నారు. ఇక ఈ ల్యాప్‌టాప్ ప్రారంభ ధర రూ.45,990గా ఉంది.

Share
Editor

Recent Posts