భవిష్యత్తును చాలా వరకూ సరిగ్గా ఊహించిన వారిలో వంగ బాబా ఒకరు. చూపు లేని ఆమె.. కళ్లు మూసుకొని ఆకాశం వైపు చూస్తూ.. భవిష్యత్తును అంచనా వేస్తూ ఉంటుంది. వీరబ్రహ్మేంద్రస్వామి, నోస్ట్రడామస్ లాగానే ఆమె కూడా చాలా వరకూ జరగబోయే అంశాలను ముందే చెప్పి ఆ్చర్యపరచింది. ఆమె చెప్పిన 6 అంశాల్లో 2 నిజంగానే జరిగాయి. ల్గేరియాకు చెందిన ఈ వృద్ధ మహిళ అంధురాలు. 1911 అక్టోబర్ 3 నుంచి 1996 ఆగస్టు 11 వరకు ఆమె జీవించింది. తన దివ్యదృష్టితో భవిష్యత్‌ను అంచనా వేసింది. వచ్చే ఏడాది(2025)కి సంబంధించిన ప్రిడిక్షన్స్ కూడా ఆమె అంచనా వేసింది. 12 ఏళ్ల వయస్సులో.. ఓ పెనుతుఫానులో తన రెండు కళ్లను కోల్పోయారు. అప్పట్నుంచి ఆమెకు భవిష్యత్‌లో ప్రపంచవ్యాప్తంగా జరిగే… పెనుప్రమాదాలు, ప్రకృతి ప్రకోపాలు కంటి ముందు కనిపించేవట.
85 ఏళ్ల వయస్సులో కన్నుమూశారు బాబా వంగా. కానీ.. ఇప్పటికి ఆమె ఇల్లును ఓ పవిత్ర మందిరం లాగా భావిస్తారు స్థానికులు. సమాధిని కూడా ఆలయంలా కొలుస్తారు. బ్లైండ్ బాబా వంగా దివ్యదృష్టి , అపారమైన జ్ఞానం అందరిని ఆశ్చర్యానికి గురి చేసేది.. కొన్ని సార్లు.. ఆమె జ్యోతిష్యం గురి తప్పింది. కానీ.. చాలాసార్లు ముమ్మాటికి నిజమయ్యింది. 2025లో దిగ్భ్రాంతికర ఘటనలు చోటుచేసుకుంటాయి. ప్రపంచం అంతం ప్రారంభమవుతుందని ఆమె అంచనా వేసింది. బాబా వంగా ప్రిడిక్షన్స్ ప్రముఖ మ్యాగజైన్ ఔట్‌లుక్‌లో ప్రచురితమైంది. ఆమె అంచనాల కాలక్రమం ప్రకారం.. 5079 వరకు ప్రపంచం పూర్తిగా అంతం కాదు. 2025లో అపోకలిప్స్ ప్రారంభమవుతుందని ఆమె అంచనా వేసింది.
అపోకలిప్స్ అనేది ఒక సాహిత్య సిద్ధాంతం. ఇందులోని అతీంద్రియ జీవి.. విశ్వం రహస్యాలు, భవిష్యత్తును మానవ మధ్యవర్తికి చేరవేస్తుంది. యూరప్‌లో ఒక వివాదం 2025 నాటికి ఆ ఖండంలోని జనాభాకు హాని కలిగిస్తుందని బాబా వంగా అంచనా వేశారు. ప్రపంచం అంతానికి దారితీస్తుందని అంచనా వేసిన అంశాలు ఏంటంటే…2025: ఐరోపాలో సంఘర్షణ కారణంగా అక్కడి జనాభా నాశనం అవుతుంది.2028: మానవులు శుక్ర గ్రహాన్ని శక్తి వనరుగా అన్వేషించడం ప్రారంభించవచ్చు.2033: ధ్రువాల మంచు కొండలు కరగడం, సముద్ర మట్టాలు వేగంగా పెరగడం ప్రారంభం అవుతుంది.2076: కమ్యూనిజం ప్రపంచమంతటా వ్యాప్తి చెందుతుంది.2130: మానవులు గ్రహాంతరవాసులతో సంబంధాన్ని ఏర్పరచుకోవచ్చు.2170: కరువు కారణంగా భూమిపై చాలా భాగాలు నాశనం అవుతాయి. 3005: అంగారకుడిపై నాగరికత కోసం భూమిపై యుద్ధం జరగవచ్చు.3797: మానవులు భూమిని విడిచిపెట్టవచ్చు. ఎందుకంటే భూ గ్రహం నివాస యోగ్యంగా పనికిరాదు. 5079: ప్రపంచం అంతం కావచ్చు.