lifestyle

తాళం చెవుల‌కు ఉండే ట్యాగ్‌పై నంబ‌ర్ ఉంటుంది క‌దా.. అదేమిటో తెలుసా..?

మోటార్ సైకిళ్లు, కార్లు, ఇత‌ర వాహ‌నాల‌కు సాధార‌ణంగా డ‌బుల్ కీ ల‌ను అందిస్తారు. ఒక తాళం చెవి పోయినా రెండో తాళం చెవి ఉంటుంది. దీంతో ఇబ్బంది క‌ల‌గ‌దు. అయితే రెండో తాళం చెవి కూడా దుర‌దృష్ట‌వ‌శాత్తూ పోతే అప్పుడు వేరే తాళం బిగించుకుంటారు. మ‌ళ్లీ కొత్త తాళం చెవులు వ‌స్తాయి. అయితే తాళం చెవి పోతే తాళాన్నే మార్చాల్సిన ప‌నిలేదు. అవును.. ఎలా అంటే…

తాళం చెవుల‌కు చిత్రంలో చూపిన విధంగా ట్యాగ్‌లు ఉంటాయి. వాటిపై నంబ‌ర్లు ఉంటాయి. అయితే ఆ నంబ‌ర్ ఏమిట‌నేది చాలా మందికి తెలియ‌దు. కానీ ఆ నంబ‌ర్ ఆ తాళం చెవికి సంబంధించిన‌ది. ఆ నంబ‌ర్ స‌హాయంతో డూప్లికేట్ తాళం చెవులను సుల‌భంగా పొంద‌వ‌చ్చు. కంపెనీకి చెందిన స‌ర్వీస్ సెంట‌ర్‌లో ఆ తాళం చెవుల‌కు ఉండే ట్యాగ్ నంబ‌ర్‌ను చెబితే సుల‌భంగా తాళం చెవులు పొంద‌వ‌చ్చు.

do you the number on keys tag

ఇక ఆ నంబ‌ర్ స‌హాయంతో బ‌య‌ట కూడా తాళం చెవుల‌ను త‌యారు చేయించుకోవ‌చ్చు. ఈ క్ర‌మంలో తాళాన్ని మార్చాల్సిన పని ఉండ‌దు. త‌క్కువ ఖ‌ర్చుతో ప‌ని అయిపోతుంది. క‌నుక కొత్త‌గా వాహ‌నం కొన్న‌ప్పుడు దాని తాళం చెవుల‌కు ఇచ్చే ట్యాగ్‌ను తీసి భ‌ద్ర ప‌రుచుకోండి. తాళం చెవులు పోయిన‌ప్పుడు ప‌నికొస్తుంది.

Admin

Recent Posts