Bachalikura Pappu : బ‌చ్చ‌లికూర‌తో ప‌ప్పు ఇలా చేశారంటే.. రుచి అదిరిపోతుంది..!

Bachalikura Pappu : మ‌నం ఆహారంగా తీసుకునే ఆకుకూర‌ల్లో బ‌చ్చ‌లికూర కూడా ఒక‌టి. బ‌చ్చ‌లిక‌ర మ‌న ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. దీనిని తీసుకోవ‌డం వ‌ల్ల ఎముకలు ధృడంగా త‌యార‌వుతాయి. కంటి చూపు మెరుగుప‌డుతుంది. శ‌రీరానికి కావ‌ల్సినంత ఐర‌న్ ల‌భిస్తుంది. ర‌క్త‌హీన‌త స‌మ‌స్య త‌గ్గుతుంది. జీర్ణ‌శ‌క్తి మెరుగుపడుతుంది. ఈ విధంగా అనేక ర‌కాలుగా బ‌చ్చ‌లికూర మ‌న‌కు స‌హాయ‌ప‌డుతుంది. బ‌చ్చ‌లికూర‌తో చేసుకోద‌గిన రుచికర‌మైన వంట‌కాల్లో బ‌చ్చ‌లికూర ప‌ప్పు కూడా ఒక‌టి. ఈ ప‌ప్పు తిన్నా కొద్ది తినాల‌నిపించేత‌ రుచిగా ఉంటుంది. ఈ ప‌ప్పును ఎవ‌రైనా చాలా సుల‌భంగా త‌యారు చేసుకోవ‌చ్చు. క‌మ్మ‌గా, రుచిగా బ‌చ్చ‌లికూర‌తో పప్పును ఎలా త‌యారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.

బ‌చ్చ‌లికూర ప‌ప్పు త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు..

కందిప‌ప్పు – అర క‌ప్పు, త‌రిగిన ఉల్లిపాయ‌లు – 2, త‌రిగిన ప‌చ్చిమిర్చి – 4, త‌రిగిన ట‌మాటాలు – 2, వెల్లుల్లి రెబ్బ‌లు -10, తరిగిన బ‌చ్చ‌లికూర – 2 క‌ట్ట‌లు, నూనె – 2 టేబుల్ స్పూన్స్, ఉప్పు -త‌గినంత‌, కారం -ఒక టీ స్పూన్, ప‌సుపు – పావు టీస్పూన్, నాన‌బెట్టిన చింత‌పండు – చిన్న నిమ్మ‌కాయంత‌, తాళింపు దినుసులు -ఒక టేబుల్ స్పూన్, ఎండుమిర్చి – 2, క‌రివేపాకు – ఒక రెమ్మ‌, ధ‌నియాల పొడి – ఒక టీ స్పూన్.

Bachalikura Pappu recipe in telugu make in this method
Bachalikura Pappu

బ‌చ్చ‌లికూర ప‌ప్పు త‌యారీ విధానం..

ముందుగా కుక్క‌ర్ లో పప్పును తీసుకుని శుభ్రంగా క‌డ‌గాలి. త‌రువాత త‌గిన‌న్ని నీళ్లు, ఉప్పు, ప‌సుపు, నూనె వేసి మూత పెట్టాలి. ఈ ప‌ప్పును 3 విజిల్స్ వ‌చ్చే వ‌ర‌కు ఉడికించి స్ట‌వ్ ఆఫ్ చేసుకోవాలి. త‌రువాత మూత తీసి పప్పును మెత్త‌గా చేసుకుని ప‌క్క‌కు ఉంచాలి. త‌రువాత క‌ళాయిలో నూనె వేసి వేడి చేయాలి. నూనె వేడ‌య్యాక వెల్లుల్లి రెబ్బ‌లు, తాళింపు దినుసులు, క‌రివేపాకు, ఎండుమిర్చి వేసి వేయించాలి. త‌రువాత ప‌చ్చిమిర్చిని, ఉల్లిపాయ ముక్క‌ల‌ను వేసి వేయించాలి. ఉల్లిపాయ ముక్క‌లు వేగిన త‌రువాత ట‌మాట ముక్క‌లు వేసి క‌ల‌పాలి. ట‌మాట ముక్క‌లు పూర్తిగా మ‌గ్గిన త‌రువాత కారం, ఉప్పు, ధ‌నియాల పొడి, ప‌సుపు వేసి క‌ల‌పాలి.

వీటిని ఒక నిమిషం పాటు వేయించిన త‌రువాత బ‌చ్చ‌లికూర వేసి క‌ల‌పాలి. త‌రువాత మూత పెట్టి మ‌ధ్య మ‌ధ్య‌లో క‌లుపుతూ బచ్చ‌లికూర మెత్త‌గా అయ్యే వ‌ర‌కు ఉడికించాలి. బ‌చ్చ‌లికూర మెత్త‌గా అయిన త‌రువాత ఉడికించిన పప్పు వేసి క‌ల‌పాలి. త‌రువాత చింత‌పండుర‌సం వేసి క‌ల‌పాలి. దీనిపై మూత పెట్టి 10 నిమిషాల పాటు ఉడికించి స్ట‌వ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల ఎంతో రుచిగా ఉండే బ‌చ్చ‌లికూర ప‌ప్పు త‌యారవుతుంది. దీనిని అన్నం, య‌పాతీ, రోటీ వంటి వాటితో తింటే చాలా రుచిగా ఉంటుంది. ఈ విధంగా బ‌చ్చ‌లికూర పప్పును త‌యారు చేసి తీసుకోవ‌డం వ‌ల్ల మ‌నం రుచితో పాటు చ‌క్క‌టి ఆరోగ్యాన్ని కూడా పొంద‌వ‌చ్చు.

D

Recent Posts