Kothimeera Rice : కొత్తిమీర రైస్‌ను ఇలా చేశారంటే.. అంద‌రూ ఇష్టంగా తింటారు..!

Kothimeera Rice : మ‌నం వంటల్లో విరివిరిగా కొత్తిమీర‌ను వాడుతూ ఉంటాము. కొత్తిమీర‌ను వేయ‌డం వ‌ల్ల వంట‌లు చూడ‌డానికి చాలా చ‌క్క‌గా ఉండ‌డంతో పాటు మ‌న ఆరోగ్యానికి కూడా మేలు క‌లుగుతుంది. కొత్తిమీర‌లో ఎన్నో ఆరోగ్య ప్ర‌యోజ‌నాలు కూడా దాగి ఉన్నాయి. మ‌న ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే ఈ కొత్తిమీర‌తో మ‌నం కొత్తిమీర రైస్ ను కూడా త‌యారు చేసుకోవ‌చ్చు. కొత్తిమీర రైస్ చాలా రుచిగా ఉంటుంది. దీనిని త‌యారు చేయ‌డం కూడా చాలా సుల‌భం. లంచ్ బాక్స్ ల‌ల్లోకి కూడా ఈ రైస్ చాలా చ‌క్క‌గా ఉంటుంది. మిగిలిన అన్నంతో కూడా మ‌నం ఈ కొత్తిమీర రైస్ ను త‌యారు చేసుకోవ‌చ్చు. ఎంతో రుచిగా ఉండే కొత్తిమీర రైస్ ను ఎలా త‌యారు చేసుకోవాలి.. త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు ఏమిటి.. అన్న వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం.

కొత్తిమీర రైస్ త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు..

త‌రిగిన కొత్తిమీర – పెద్ద క‌ట్ట ఒక‌టి, అన్నం – పావుకిలో బియ్యంతో వండినంత‌, ట‌మాటాలు – పెద్ద‌ది ఒక‌టి, ప‌చ్చిమిర్చి – 6, నూనె – 2 టేబుల్ స్పూన్స్, ఉప్పు – త‌గినంత‌, త‌రిగిన జీడిప‌ప్పు – కొద్దిగా, వెల్లుల్లి రెబ్బ‌లు – 10, త‌రిగిన ఉల్లిపాయ – పెద్ద‌ది ఒకటి, అల్లం వెల్లుల్లి పేస్ట్ – ఒక టీ స్పూన్, దాల్చిన చెక్క‌- ఒక ఇంచు ముక్క‌, ల‌వంగాలు – 4, యాల‌కులు – 3, బిర్యానీ ఆకులు – 2, అనాస పువ్వు – 1.

Kothimeera Rice recipe in telugu male like this
Kothimeera Rice

కొత్తిమీర రైస్ త‌యారీ విధానం..

ముందుగా క‌ళాయిలో ఒక టేబుల్ స్పూన్ నూనె వేసి వేడి చేయాలి. నూనె వేడ‌య్యాక ప‌చ్చిమిర్చి, ట‌మాట ముక్క‌లు వేసి 2 నిమిషాల పాటు వేయించాలి. త‌రువాత కొత్తిమీర వేసి క‌ల‌పాలి. దీనిపై మూత పెట్టి కొత్తిమీర‌, ట‌మాట ముక్క‌లు పూర్తిగా మెత్త‌గా అయ్యే వ‌ర‌కు మ‌గ్గించాలి. త‌రువాత స్ట‌వ్ ఆఫ్ చేసి వీటిని చ‌ల్లారనివ్వాలి. త‌రువాత వీటిని జార్ లోకి తీసుకుని మెత్త‌ని పేస్ట్ లాగా చేసుకోవాలి. త‌రువాత క‌ళాయిలో నూనె వేసి వేడి చేయాలి. నూనె వేడ‌య్యాక మ‌సాలా దినుసులు వేసి వేయించాలి. త‌రువాత జీడిప‌ప్పు, వెల్లుల్లి రెబ్బ‌లు వేసి వేయించాలి. ఇవి కొద్దిగా వేగిన త‌రువాత ఉల్లిపాయ ముక్క‌లు వేసి వేయించాలి.

ఉల్లిపాయ ముక్క‌లు వేగిన త‌రువాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించాలి. దీనిని ప‌చ్చి వాస‌న పోయే వ‌ర‌కు వేయించిన త‌రువాత మిక్సీ ప‌ట్టుకున్న కొత్తిమీర పేస్ట్ వేసి క‌ల‌పాలి. దీనిపై మూత పెట్టి నూనె పైకి తేలే వ‌ర‌కు వేయించిన త‌రువాత ఉప్పు వేసి క‌ల‌పాలి. త‌రువాత ఉడికించిన అన్నం వేసి క‌ల‌పాలి. దీనిని అంతా క‌లిసేలా క‌లుపుకున్న త‌రువాత మూత పెట్టి మ‌రో 5 నిమిషాల పాటు ఉంచి స్ట‌వ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల ఎంతో రుచిగా ఉండే కొత్తిమీర రైస్ త‌యార‌వుతుంది. దీనిని రైతాతో తింటే చాలా రుచిగా ఉంటుంది. త‌ర‌చూ చేసే రైస్ వెరైటీల‌తో పాటు అప్పుడ‌ప్పుడూ ఇలా కొత్తిమీర రైస్ ను కూడా త‌యారు చేసుకుని తిన‌వ‌చ్చు. దీనిని అంద‌రూ ఎంతో ఇష్టంగా తింటారు.

Share
D

Recent Posts