Beetroot Samosa : బీట్ రూట్ స‌మోసాల‌ను ఇలా చేస్తే.. అంద‌రూ ఇష్టంగా తింటారు..

Beetroot Samosa : బీట్‌రూట్ వ‌ల్ల మ‌న‌కు ఎన్ని ఆరోగ్య‌క‌ర‌మైన ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయో అంద‌రికీ తెలిసిందే. వీటిల్లో యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. అందువ‌ల్ల వీటిని తింటే రోగ నిరోధ‌క శ‌క్తి పెరుగుతుంది. అలాగే వ్యాధుల నుంచి బ‌య‌ట ప‌డ‌వ‌చ్చు. ర‌క్తం కూడా బాగానే త‌యార‌వుతుంది. అయితే బీట్‌రూట్‌ను చాలా మంది నేరుగా తినేందుకు ఇష్ట‌ప‌డ‌రు. కానీ దీన్ని స‌మోసాలుగా చేస్తే అంద‌రూ ఎంతో ఇష్టంగా తింటారు. ఇక బీట్‌రూట్‌ల‌తో స‌మోసాల‌ను ఎలా త‌యారు చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.

Beetroot Samosa very easy to make and tasty
Beetroot Samosa

బీట్ రూట్ స‌మోసా త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు..

బీట్ రూట్ 1 కప్పు ఉడికించి పెట్టాలి. బంగాళదుంపలు 2 ఉడికించి పొట్టు తీయాలి. సన్నగా తరిగిన ఉల్లిపాయలు అర‌ కప్పు, పచ్చి మిర్చి 4, కొత్తిమీర 1 కప్పు, మైదా 3 కప్పులు, నెయ్యి 3 స్పూన్లు, ఉప్పు రుచికి సరిపడా, కారం 1 స్పూన్, నూనె డీప్ ఫ్రై కి సరిపడా.

బీట్ రూట్ స‌మోసాను త‌యారు చేసే విధానం..

మైదాలో వేడి వేడి నెయ్యి వేసి ఉప్పు కలిపి నీరు పోస్తూ పూరీ పిండిలా కలిపి ఉంచాలి. ఉడికించిన దుంపలను చిన్న ముక్కలుగా కట్ చేయాలి. స్టవ్ వెలిగించి కడాయి పెట్టి నాలుగు టీస్పూన్ల నూనె వేసి ఉల్లి, పచ్చి మిర్చి ముక్కలు వేసి వేయించాలి. తరువాత దుంపలను వేసి ఉప్పు, కారం వేసి బాగా కలపాలి. కూర దగ్గరగా అవుతున్నప్పుడు కొత్తిమీర కలిపి దించాలి. మైదా మిశ్రమాన్ని చిన్న ఉండలుగా చేసుకోవాలి. ఒక్కో ఉండని పూరీలాగా ఒత్తుకుని మధ్యకు కట్ చేయాలి. ఒక్కో ముక్కను కోన్ ఆకారంలో చుట్టి అందులో బీట్ రూట్ కూరను పెట్టి అంచులను తడి చేతితో నొక్కాలి. అలా చేసుకున్న వాటిని నూనెలో వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. అంతే బీట్ రూట్ సమోసాలు రెడీ అవుతాయి. వీటిని నేరుగా అలాగే తిన‌వచ్చు. ఎంతో రుచిగా ఉంటాయి. అంద‌రూ ఇష్టంగా తింటారు.

Share
Editor

Recent Posts