Bendakaya Palli Karam : బెండ‌కాయ ప‌ల్లికారం ఒక్క‌సారి ఇలా చేయండి.. రుచి చూస్తే విడిచిపెట్ట‌రు..!

Bendakaya Palli Karam : మ‌నం బెండ‌కాయ‌ల‌తో ర‌క‌ర‌కాల వంట‌కాల‌ను త‌యారు చేసి తీసుకుంటూ ఉంటాము. బెండ‌కాయ‌ల‌తో చేసే వంట‌కాలు చాలా రుచిగా ఉంటాయి. అలాగే బెండ‌కాయ‌ల‌ను తీసుకోవ‌డం వ‌ల్ల మన ఆరోగ్యానికి కూడా మేలు క‌లుగుతుంది. అయితే బెండ‌కాయ‌తో త‌రుచూ చేసే వంట‌కాల‌తో పాటు కింద చెప్పిన విధంగా బెండ‌కాయ ప‌ల్లికారాన్ని కూడా త‌యారు చేసుకోవ‌చ్చు. ప‌ల్లీలు వేసి చేసే ఈ బెండ‌కాయ ఫ్రై చాలా రుచిగా ఉంటుంది. అన్నంతో తిన‌డానికి ఇది చాలా చ‌క్క‌గా ఉంటుంది. రుచిగా, క‌మ్మ‌గా ఉండే ఈ బెండ‌కాయ ప‌ల్లికారాన్ని ఎలా త‌యారు చేసుకోవాలి.. త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు ఏమిటి.. అన్న వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం.

బెండ‌కాయ ప‌ల్లికారం త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు..

త‌రిగిన బెండ‌కాయ‌లు – అర‌కిలో, ప‌ల్లీలు – అర క‌ప్పు, త‌రిగిన ఉల్లిపాయ – పెద్ద‌ది ఒక‌టి, నూనె – 3 టేబుల్ స్పూన్స్, వెల్లుల్లి రెబ్బ‌లు – 10 నుండి 12, ఉప్పు – త‌గినంత‌, కారం – ఒక టీ స్పూన్, ధ‌నియాల పొడి – ఒక టీ స్పూన్, తాళింప‌సు దినుసులు – ఒక టేబుల్ స్పూన్, ఎండుమిర్చి – 2, ప‌చ్చిమిర్చి – 2, క‌రివేపాకు – రెండు రెమ్మ‌లు, త‌రిగిన కొత్తిమీర – కొద్దిగా.

Bendakaya Palli Karam recipe very tasty how to make it
Bendakaya Palli Karam

బెండ‌కాయ ప‌ల్లికారం త‌యారీ విధానం..

ముందుగా బెండ‌కాయ‌ల‌ను శుభ్రంగా క‌డిగి త‌డి లేకుండా తుడ‌వాలి. త‌రువాత వీటిని గాలికి ఆర‌బెట్టి ముక్క‌లుగా క‌ట్ చేసుకోవాలి. ఇప్పుడు క‌ళాయిలో నూనె వేసి వేడి చేయాలి. త‌రువాత ఇందులో ప‌ల్లీలు వేఇ వేయించాలి. ప‌ల్లీలు వేగిన త‌రువాత వీటిని గిన్నెలోకి తీసుకోవాలి. ఇప్పుడు అదే నూనెలో బెండ‌కాయ ముక్క‌ల‌ను రెండు భాగాలుగా వేసి వేయించాలి. వీటిని ఎర్ర‌గా అయ్యే వ‌ర‌కు వేయించి ప్లేట్ లోకి తీసుకోవాలి. త‌రువాత మిగిలిన ముక్క‌ల‌ను వేసి వేయించి ప్లేట్ లోకి తీసుకోవాలి. ఇప్పుడు జార్ లో వేయించిన ప‌ల్లీలల్లో నుండి స‌గం ప‌ల్లీల‌ను వేసుకోవాలి.

త‌రువాత వెల్లుల్లి రెబ్బ‌లు, ఉప్పు, కారం, ధనియాల పొడి వేసి మ‌రో మెత్త‌గా కాకుండా మిక్సీ ప‌ట్టుకోవాలి. త‌రువాత ముందుగా ఉప‌యోగించిన క‌ళాయిలోనే తాళింపు దినుసులు వేసి వేయించాలి. త‌రువాత ప‌చ్చిమిర్చి, ఎండుమిర్చి, క‌రివేపాకు వేసి వేయించాలి. త‌రువాత ఉల్లిపాయ ముక్క‌లు వేసి వేయించాలి. త‌రువాత వేయించిన ప‌ల్లీలు, బెండ‌కాయ ముక్క‌లు, మిక్సీ ప‌ట్టుకున్న పొడి వేసి క‌ల‌పాలి. దీనిని మ‌రో 2 లేదా 3 నిమిషాల పాటు వేయించి కొత్తిమీర చ‌ల్లుకుని స్ట‌వ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా చేయ‌డం వల్ల ఎంతో రుచిగా ఉండే బెండ‌కాయ ప‌ల్లికారం త‌యార‌వుతుంది. దీనిని అన్నంతో తింటే చాలా రుచిగా ఉంటుంది.

D

Recent Posts