Home Tips

నకిలీ పన్నీర్ తో జాగ్రత్త.. ఇలా గుర్తించండి..!

ఆహార పదార్థాల విషయంలో కూడా ఈ మధ్యకాలంలో మోసాలు ఎక్కువైపోయాయి. నకిలీ ఆహారపదార్దాలను అమ్మేసి డబ్బులు దోచుకుంటున్నారు. మొన్నటి వరకు ప్లాస్టిక్ వెల్లుల్లిపాయల్ని మనం చూసాము. అయితే ఇప్పుడు పన్నీర్, గుడ్లు కూడా కల్తీ చేస్తున్నారు. పన్నీర్ విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి లేదంటే అనవసరంగా నకిలీ పన్నీర్ ని కొనుగోలు చేసి నష్టపోవాల్సి ఉంటుంది. నకిలీ పన్నీర్ ని గుర్తించినట్లయితే నష్టాలు తప్పుతాయి.

పన్నీర్ కల్తీ గురించి తెలుసుకున్న పోలీసులు 300 కేజీల నకిలీ పన్నీర్ ని కనిపెట్టారు. ఈ నకిలీ పన్నీర్ ని తీసుకున్నట్లయితే అజీర్తి సమస్యలు వస్తాయని.. 300 కేజీల పన్నీర్ ని సీజ్ చేశారు. పాల కొవ్వు, సోయా కొవ్వు మాత్రమే కాకుండా మిగిలిన కొన్ని రకాల కొవ్వు పదార్థాలను కనుగొన్నారు.

beware of adulterated paneer how to identify it

పెద్ద మొత్తంలో పన్నీరుని కల్తీ చేసినట్లు తెలుస్తోంది. దీనిని సింథటిక్ పన్నీర్ అని కూడా పిలవచ్చు. ఇది ఆరోగ్యానికి హాని చేస్తుంది. యూరియా, బొగ్గు, డిటర్జెంట్, సల్ఫరిక్ యాసిడ్ వంటి వాటితో కల్తీ చేసినట్లు తెలుస్తోంది. నకిలీ పన్నీర్ లో గ్లిజరిన్, సల్ఫరిక్ యాసిడ్, డిటర్జెంట్ పౌడర్ వంటివి ఉండడం వలన చాలా నష్టాలను ఎదుర్కోవాలి. పన్నీర్ ని మీరు పౌడర్ చేసినట్లయితే చిన్న చిన్న క్రమ్ప్స్ ఉంటే అది పాలపొడితో చేసినట్టు. కానీ నిజమైన పన్నీర్ అలా ఉండదు.

Peddinti Sravya

Recent Posts