vastu

Kitchen Vastu Tips : వంటగదిలో ఈ వాస్తు చిట్కాలని పాటిస్తే.. డబ్బుకి, ధాన్యానికి కొరతే ఉండదు..!

Kitchen Vastu Tips : వాస్తు ప్రకారం పాటించడం వలన అంతా మంచే జరుగుతుంది. సమస్యలన్నీ కూడా పోతాయి. అందుకని చాలా మంది తప్పులు చేయకుండా, వాస్తు ప్రకారం నడుచుకుంటారు. ఈ వాస్తు చిట్కాలని కనుక మీరు కచ్చితంగా పాటించారంటే, డబ్బుకి కానీ ధాన్యానికి కొరత ఉండదు. కనుక కచ్చితంగా ఇలా మీరు పాటించాల్సిందే. మీ వంటగది ఏ దిశలో ఉంది అనేది చాలా ముఖ్యమైనది.

అలా చూసుకుని పాటిస్తే మిమ్మల్ని ఎప్పుడూ వ్యాధులు చుట్టుముట్టవు. వంటగది సరైన దిశలో ఉంటేనే మీరు ఆరోగ్యంగా, ఆనందంగా ఉండగలరు. వంటగదిలో తూర్పు వైపు కిటికీ ఉంటే చాలా మంచి జరుగుతుంది. వంటగదిలోకి సానుకూల శక్తి వస్తుంది. ఉదయాన్నే వంటగదిలో సూర్యకాంతి పడుతుంది కాబట్టి చాలా మంచి జరుగుతుంది. వంట చేసేటప్పుడు తూర్పు వైపు నిలబడి వంట చేయడం కూడా చాలా మంచిది.

follow these vastu tips in kitchen to attract wealth

వంట గదిలో ఫ్రిడ్జ్, మైక్రోవేవ్, మిక్సర్, గ్రైండర్ వంటివి పెట్టుకోవచ్చు. వాటిని పెట్టడం వలన నష్టం ఉండదు. కానీ వాటిని ఏ దిశలో పెట్టారనేది ముఖ్యము. వీటిని మీరు ఉత్తర దిశలో పెడితే చాలా మంచిది. అదృష్టం కలుగుతుంది. వంట గదిలో ఉండే పాత్రలు పడమర వైపు ఉంటే మంచిది. వంటగదిలో పెయింట్ వేయించేటప్పుడు ఎరుపు రంగుని వేయించకండి. నలుపు, గోధుమ రంగు పెయింట్ కూడా మంచిది కాదు.

పసుపు రంగు, పాస్టల్ గ్రీన్, నిమ్మ రంగు వంటివి మంచివి. టాయిలెట్ మీద ఎప్పుడూ కూడా వంటగదిని కట్టుకోకండి. వంటగదిలో పాత సామాన్లు, విరిగిపోయినవి, పనికిరానివి అసలు ఉంచకూడదు. ఇలాంటి వాటి వల్ల నెగటివ్ ఎనర్జీ కలుగుతుంది. చూశారు కదా వంటగదిలో ఎలాంటి మార్పులు చేసుకుంటే మంచి జరుగుతుంది, ఎలా పాజిటివ్ ఎనర్జీని పొందొచ్చు అనేది. ఈ తప్పులను చేయకుండా ఇక్కడ చెప్పినట్లుగా ఆచరించి బాధల నుండి బయటపడండి. వీటిని కచ్చితంగా మీరు పాటిస్తే ధాన్యానికి కానీ డబ్బుకి కానీ అసలు కొరతే ఉండదు.

Admin

Recent Posts