lifestyle

Puttu Ventrukalu : పిల్ల‌ల‌కు పుట్టు వెంట్రుక‌ల‌ను తీయించ‌డం వెనుక ఉన్న సైంటిఫిక్ కార‌ణం ఇదే..!

Puttu Ventrukalu : పుట్టిన తర్వాత కొన్నాళ్ళకి పిల్లలకి పుట్టు వెంట్రుకలు తీస్తారు. ఆనవాయితీ ప్రకారం పుట్టు వెంట్రుకలని తీస్తూ ఉంటారు. ఈ ఆచారాన్ని చాలామంది హిందువులు పాటిస్తూ ఉంటారు. మొదటిసారి ఇంటి దేవుడికి తల నీలాలని సమర్పిస్తూ ఉంటారు. ఇది వరకు చూసుకున్నట్లయితే కేవలం మగ పిల్లలకి మాత్రమే ఈ సాంప్రదాయాన్ని పాటించేవాళ్ళు. కానీ ఈ రోజుల్లో ఆడపిల్లలకి కూడా మొదటిసారి తలనీలాలని ఇంటి దేవుడికి అర్పించే ఆచారం పాటిస్తున్నారు.

తలనీలాలని తీయించే విధానాన్ని పుట్టు వెంట్రుకలు తీయించడం అని అంటారు. ఒక వేడుకలాగా దీనిని నిర్వహిస్తూ ఉంటారు. మొదటిసారి తలనీలాలని తీసే సంప్రదాయంలో చాలా నియమాలు ఉంటాయి. కొంతమంది బాబు లేదా పాప ఏడాదిలోపు తీస్తే, కొంత మంది మూడేళ్లు లోపు, కొంత మంది 5 ఏళ్లలోపు తల నీలాలని తీస్తూ ఉంటారు. తలనీలాలని తీయించేటప్పుడు ఆ రోజు చాలా మంచిదై ఉండాలి.

scientific reason puttu ventrukalu

తలనీలాలు తీసే సమయంలో బిడ్డని అమ్మ తన ఒళ్ళో కూర్చోపెట్టుకుంటుంది. అప్పుడు ఎదురుగా పూజారి మంత్రాలు చదువుతాడు. ఈ సమయంలో మూడుసార్లు మేనమామ, మేనల్లుడు లేదా మేనకోడలు జుట్టు కత్తిరిస్తాడు. ఆ తర్వాత మిగిలిన జుట్టుని తొలగిస్తారు. తలనీలాలని తీయడం వెనుక చాలా నియమాలు, నమ్మకాలు ఉన్నాయి.

పుట్టుకతో వచ్చిన జుట్టులో పూర్వజన్మకు సంబంధించిన లక్షణాలు ఉంటాయని, ఈ జన్మలో వాటిని ఉండకుండా తొలగించాలని తలనీలాలని తీసేస్తారట. ఈ సాంప్రదాయం వెనక సైన్స్ కూడా ఉంది. తలనీలాలను తీయించడం వలన మెదడు ఎదుగుదల బాగుంటుందట. నరాలు ఆరోగ్యంగా, యాక్టివ్ గా ఉంటాయి. అనారోగ్య సమస్యలన్నీ తొలగిపోయి ఆరోగ్యంగా బలంగా బిడ్డలు ఉంటారట. ఇలా తలనీలాల వెనుక ఆధ్యాత్మికత, సైన్స్ కూడా దాగి ఉన్నాయి.

Admin

Recent Posts