Bhimla Nayak : పవర్ స్టార్ పవన్ కల్యాణ్ హీరోగా తెరకెక్కిన చిత్రం.. భీమ్లా నాయక్. ఈ సినిమా ఈ నెల 25వ తేదీన పెద్ద ఎత్తున థియేటర్లలో విడుదల కానుంది. ఈ క్రమంలోనే సోమవారం సాయంత్రం ఈ సినిమాకు చెందిన ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను హైదరాబాద్‌లో నిర్వహించాలని మేకర్స్ ప్లాన్ చేశారు. అయితే ఈ ఈవెంట్‌ను రద్దు చేశారు.
భీమ్లా నాయక్ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు మంత్రి కేటీఆర్‌ను ముఖ్య అతిథిగా ఆహ్వానించిన విషయం విదితమే. అయితే ఆయన ఈ కార్యక్రమానికి రావడం లేదని చెప్పారు. కారణం.. ఏపీ ఐటీ శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి కన్నుమూయడమే. అందుకని మంత్రి కేటీఆర్ ఈ ఫంక్షన్‌కు రావడం లేదని చెప్పారు. దీంతో మరోసారి ఆలోచన చేయకుండానే మేకర్స్ ఈ ఈవెంట్‌ను రద్దు చేస్తున్నట్లు తెలిపారు. అయితే సినిమా విడుదలకు మరో 4 రోజులు మాత్రమే ఉండడంతో ఈవెంట్‌ను మళ్లీ ఎప్పుడు నిర్వహిస్తారన్నది ఉత్కంఠను కలిగిస్తోంది.
కాగా భీమ్లా నాయక్ సినిమాలో రానా మరో కీలకపాత్రలో నటించారు. ఇక ఇందులో నిత్యమీనన్, సంయుక్త మీనన్‌లు పవన్, రానాలకు హీరోయిన్లుగా నటించారు. ఈ క్రమంలోనే ఈ సినిమాకు ఇప్పటికే అనేక అవాంతరాలు ఎదురయ్యాయి. దీంతో మరోమారు తాజాగా ఇంకో అవాంతరం ఎదురైంది.