Bhindi Curry : బెండ‌కాయ‌ల‌తో మ‌సాలా కూర‌ను ఇలా చేస్తే.. లొట్ట‌లేసుకుంటూ మొత్తం తినేస్తారు..!

Bhindi Curry : బెండ‌కాయ‌ల‌తో ర‌క‌ర‌కాల వంట‌కాల‌ను త‌యారు చేసుకుని తింటూ ఉంటాం. బెండ‌కాయ‌ల‌తో చేసే వంట‌కాలు చాలా రుచిగా ఉంటాయి. బెండ‌కాయ‌ల‌ను ఆహారంగా తీసుకోవ‌డం వ‌ల్ల మ‌న ఆరోగ్యానికి కూడా మేలు క‌లుగుతుంది. బెండ‌కాయ‌ల‌తో వేపుడు, పులుసే కాకుండా వీటితో మ‌నం ఎంతో రుచిగా ఉండే మ‌సాలా కూర‌ను కూడా త‌యారు చేసుకోవ‌చ్చు. ఈ కూర‌ను త‌యారు చేయ‌డం కూడా చాలా సుల‌భం. బెండ‌కాయ‌ల‌ను తిన‌ని వారు కూడా ఈ కూర‌ను ఇష్టంగా తింటారు. తిన్నా కొద్ది తినాల‌నిపించేంత రుచిగా ఉండే బెండ‌కాయ మ‌సాలా క‌ర్రీని ఎలా త‌యారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.

బెండ‌కాయ మ‌సాలా క‌ర్రీ త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు..

నూనె – 2 టేబుల్ స్పూన్స్, పెద్ద ముక్క‌లుగా త‌రిగిన బెండ‌కాయ ముక్క‌లు – పావు కిలో, జీల‌క‌ర్ర – ఒక టీ స్పూన్, ఉల్లిపాయ ముక్క‌లు – పావు క‌ప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్ – ఒక టీ స్పూన్, ప‌సుపు – పావు టీ స్పూన్, కారం – 2 టీ స్పూన్స్, జీల‌క‌ర్ర పొడి – ఒక టీ స్పూన్, ధ‌నియాల పొడి – ఒక టీ స్పూన్, గ‌రం మ‌సాలా – అర టీ స్పూన్, ఉప్పు – త‌గినంత‌, ట‌మాట ముక్క‌లు – పావు క‌ప్పు, పెరుగు – 2 టేబుల్ స్పూన్స్.

Bhindi Curry recipe in telugu make in this method
Bhindi Curry

బెండ‌కాయ మ‌సాలా క‌ర్రీ త‌యారీ విధానం..

ముందుగా బెండ‌కాయ‌ల‌ను శుభ్రంగా క‌డిగి త‌డి లేకుండా తుడ‌వాలి. తరువాత వీటిని పెద్ద ముక్క‌లుగా క‌ట్ చేసుకోవాలి. త‌రువాత క‌ళాయిలో నూనె వేసి వేడి చేయాలి. నూనె వేడ‌య్యాక బెండ‌కాయ ముక్క‌లు వేసి వేయించాలి. త‌రువాత వీటిని ప్లేట్ లోకి తీసుకుని ప‌క్క‌కు ఉంచాలి. త‌రువాత అదే క‌ళాయిలో జీల‌క‌ర్ర‌, ఉల్లిపాయ ముక్క‌లు వేసి వేయించాలి. వీటిని రంగు మారే వ‌ర‌కు వేయించిన త‌రువాత అల్లం పేస్ట్ వేసి ప‌చ్చి వాస‌న పోయే వ‌ర‌కు వేయించాలి. త‌రువాత ప‌సుపు, కారం, జీల‌క‌ర్ర పొడి, ధ‌నియాల పొడి, గ‌రం మ‌సాలా, ఉప్పు వేసి క‌ల‌పాలి. త‌రువాత ట‌మాట ముక్క‌లు వేసి మెత్త‌బ‌డే వ‌ర‌కు వేయించాలి. త‌రువాత పెరుగు వేసి క‌లిపి మూత పెట్టి చిన్న మంట‌పై నూనె పైకి తేలే వ‌ర‌కు ఉడికించాలి.

త‌రువాత బెండ‌కాయ ముక్క‌లు వేసి క‌ల‌పాలి. వీటిని 5 నిమిషాల పాటు ఉడికించిన త‌రువాత అర క‌ప్పు నీళ్లు పోసి క‌ల‌పాలి. దీనిని ద‌గ్గ‌ర ప‌డే వ‌ర‌కు ఉడికించి కొత్తిమీర చ‌ల్లుకుని స్ట‌వ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల ఎంతో రుచిగా ఉండే బెండ‌కాయ మ‌సాలా క‌ర్రీ త‌యార‌వుతుంది. దీనిని అన్నంతో క‌లిపి తింటే చాలా రుచిగా ఉంటుంది. బెండ‌కాయ‌తో త‌ర‌చూ చేసే వంట‌కాల‌తో పాటు అప్పుడ‌ప్పుడూ ఇలా మ‌సాలా క‌ర్రీని కూడా త‌యారు చేసుకుని తిన‌వ‌చ్చు.

D

Recent Posts