Foods For Heart : ప్రస్తుత కాలంలో మనలో చాలా మంది గుండె జబ్బుల బారిన పడుతున్నారు. వయసుతో సంబంధం లేకుండా అందరూ ఈ సమస్య బారిన పడుతున్నారు. మారిన జీవన విధానమే ఈ సమస్యల బారిన పడడానికి ప్రధాన కారణం. మనం తీసుకునే ఆహారమే ఈ సమస్య బారిన పడడానికి ప్రధాన కారణం. కొవ్వు కలిగిన ఆహారాలను, జంక్ ఫుడ్ ను తీసుకోవడమే ఈ సమస్య బారిన పడడానికి ప్రధాన కారణం. మన గుండె ఆరోగ్యం మనం తీసుకునే ఆహారంపై ఆధారపడి ఉంటుంది. చక్కటి ఆహారాన్ని తీసుకోవడం వల్ల గుండె ఆరోగ్యం మెరుగుపడుతుంది. రక్తపోటు అదుపులో ఉంటుంది. రక్తనాళాల్లో ఇన్ ప్లామేషన్ తగ్గుతుంది. శరీరంలో కొలెస్ట్రాల్ స్థాయిలు అదుపులో ఉంటాయి. ఈ ఆహారాలను తీసుకోవడం వల్ల గుండె సమస్యలు రాకుండా ఉంటాయి.
అయితే గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరిచే ఈ ఆహారాలు ఏమిటి.. వీటిని తీసుకోవడం వల్ల మనకు కలిగే మేలు ఏమిటి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం. గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో తాజా ఆకుకూరలు, కూరగాయలు, పండ్లు మనకు ఎంతో మేలు చేస్తాయి. వీటిలో విటమిన్స్, మినరల్స్, యాంటీ ఆక్సిడెంట్లు, డైటరీ ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. ఇవి శరీరంలో కొలెస్ట్రాల్ ను కరిగించి గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో సహాయపడతాయి. అలాగే ధాన్యాలను తీసుకోవడం వల్ల కూడా గుండె పరితీరు మెరుగుపడుతుంది. వీటిలో పోషకాలు అధికంగా ఉంటాయి. ఇవి శరీరంలో కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడంలో, జీర్ణశక్తిని మెరుగుపరచడంలో, కొలెస్ట్రాల్ స్థాయిలను అదుపులో ఉంచడంలో దోహదపడతాయి. వీటిని రోజూ ఆహారంలో భాగంగా తీసుకోవడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. అలాగే డ్రై ఫ్రూట్స్ ను తీసుకోవడం వల్ల గుండె సమస్యలు రాకుండా ఉంటాయి.
వీటిలో మన శరీరానికి అవసరమయ్యే కొవ్వులతో పాటు ఫైబర్, విటమిన్స్ వంటి పోషకాలు ఎన్నో ఉంటాయి. వీటిలో క్యాలరీలు కూడా అధికంగా ఉండవు. సలాడ్స్ లో, స్నాక్స్ గా వీటిని తీసుకోవచ్చు. అలాగే బ్లూబెర్రీ, బ్లాక్ బెర్రీ, స్ట్రాబెర్రీ, రాస్ బెర్రీ వంటి పండ్లను ఎక్కువగా తీసుకోవాలి. వీటిలో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి ఇన్ ప్లామేషన్ ను తగ్గించి గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో సహాయపడతాయి. వీటిని తరచూ ఆహారంలో భాగంగా తీసుకోవడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. చిక్కుళ్లు, బీన్స్, రాజ్మా వంటి వాటిని తీసుకోవడం వల్ల రక్తపోటు అదుపులో ఉంటుంది. గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో కూడా ఇవి ఎంతగానో సహాయపడతాయి. ఈ ఆహారాలను రోజూ ఆహారంలో భాగంగా తీసుకోవడం వల్ల మనం గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోవచ్చని వీటిని తీసుకోవడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను కూడా పొందవచ్చని నిపుణులు చెబుతున్నారు.