boAt Watch Blaze : వియరబుల్స్, ఆడియో ఉత్పత్తుల తయారీదారు బోట్.. కొత్తగా వాచ్ బ్లేజ్ పేరిట ఓ నూతన స్మార్ట్ వాచ్‌ను భారత్ లో విడుదల చేసింది. ఇందులో పలు ఆకట్టుకునే ఫీచర్లను అందిస్తున్నారు. బోట్ వాచ్ బ్లేజ్ స్మార్ట్ వాచ్‌లో 1.75 ఇంచుల డిస్‌ప్లేను ఏర్పాటు చేశారు. ఇందులో అనేక రకాల వాచ్ ఫేసెస్ లభిస్తున్నాయి. 100కు పైగా క్లౌడ్ ఆధారిత వాచ్ ఫేస్‌లను డౌన్ లోడ్ చేసుకోవచ్చు. అలాగే డ్యూరబుల్ ప్రీమియం మెటల్‌తో ఈ వాచ్‌ను రూపొందించారు. కనుక ఎక్కువ కాలం మన్నికగా ఉంటుంది.
ఈ వాచ్లో ఉన్న అపోలో 3 బ్లూ ప్లస్ ప్రాసెసర్ వల్ల ఈ వాచ్ చాలా తక్కువ పవర్‌ను వాడుకుంటూ మెరుగైన ప్రదర్శనను ఇస్తుంది. ఈ వాచ్‌కు డస్ట్, వాటర్ రెసిస్టెన్స్ ఫీచర్‌ను కూడా అందిస్తున్నారు. ఒకసారి చార్జింగ్ చేస్తే 7 రోజుల వరకు బ్యాటరీ బ్యాకప్ వస్తుంది. ఇక కేవలం 10 నిమిషాల పాటు చార్జింగ్ పెడితే చాలు.. ఒక రోజుకు కావల్సిన బ్యాటరీ బ్యాకప్ లభిస్తుంది.
ఈ వాచ్‌లో యాక్టివ్ సెడెంటరీ, హైడ్రేషన్ రిమైండర్స్ ఉన్నాయి. కనుక ఎక్కువ సేపు కూర్చున్నా, ఎక్కువ సేపు నీళ్లను తాగకపోయినా.. రిమైండర్స్ పంపిస్తుంది. అలాగే ఎస్‌పీవో2 బ్లడ్ ఆక్సిజన్ మానిటర్ కూడా ఇందులో ఉంది. హార్ట్ రేట్ ట్రాకర్‌ను అందిస్తున్నారు. 14 రకాల స్పోర్ట్స్ మోడ్స్ లభిస్తున్నాయి.
బోట్ వాచ్ బ్లేజ్ స్మార్ట్ వాచ్ యాక్టిక్ బ్లాక్, డీప్ బ్లూ, రేజింగ్ రెడ్, చెర్రీ బ్లాసమ్ కలర్ ఆప్షన్లలో విడుదలైంది. ఈ వాచ్ ధర రూ.3,499 ఉండగా.. దీన్ని అమెజాన్‌లో విక్రయిస్తున్నారు.