Viral Video : ఊ అంటావా పాట‌.. డ‌చ్ సింగ‌ర్ ఎంత బాగా పాడిందో..!

Viral Video : అల్లు అర్జున్‌, ర‌ష్మిక మంద‌న్న హీరో హీరోయిన్లుగా న‌టించిన చిత్రం.. పుష్ప‌. బాక్సాఫీస్ రికార్డుల‌ను తిర‌గరాసింది. పాన్ ఇండియా స్థాయిలో విడుద‌లైన ఈ మూవీకి విమ‌ర్శ‌కుల నుంచి ప్ర‌శంస‌లు ల‌భిస్తున్నాయి. ఇక ఈ చిత్రంలోని ఊ అంటావా పాట‌కు ప్రేక్షకుల నుంచి ఎంతో ఆద‌ర‌ణ ల‌భిస్తోంది. స‌మంత ఈ పాట‌కు డ్యాన్స్ చేసి ఆక‌ట్టుకుంది. ఇక ఊ అంటావా.. పాట‌ను ఇప్ప‌టికే చాలా మంది పాడారు.

Viral Video Dutch singer sung Oo antava song
Viral Video

తాజాగా ఓ డ‌చ్ సింగర్ ఊ అంటావా.. పాట‌ను ఎంతో చ‌క్కగా ఆల‌పించింది. డ‌చ్ సింగ‌ర్ ఎమ్మా హీస్ట‌ర్స్ ఊ అంటావా పాట‌ను పాడింది. అస‌లు ఆమె పాడుతుంటే ఎవ‌రో తెలుగ‌మ్మాయి ఆల‌పించిన‌ట్లు ఉంది. కానీ ఒక విదేశీయురాలు ఈ పాట‌ను పాడింద‌ని ఎవ‌రు అనుకోవ‌డం లేదు. అంత చ‌క్క‌గా ఈమె పాట‌ను పాడింది.

ఇక పుష్ప సినిమాలోని శ్రీ‌వ‌ల్లి పాట‌కు అల్లు అర్జున్ వేసిన స్టెప్‌ను కూడా చాలా మంది అనుక‌రిస్తున్నారు. ఇత‌ర సెల‌బ్రిటీలతోపాటు క్రికెట‌ర్లు కూడా ఈ పాట‌కు స్టెప్పులు వేసి అల‌రిస్తున్నారు. వారి వీడియోలు కూడా వైర‌ల్ అవుతున్నాయి.

Share
Editor

Recent Posts