Boiled Egg Tomato Curry : కోడిగుడ్ల‌ను ఉడ‌క‌బెట్టి ట‌మాటాల‌తో ఇలా క‌లిపి వండండి.. అదిరిపోతుంది..!

Boiled Egg Tomato Curry : గుడ్డును తిన‌డం వ‌ల్ల మ‌న శ‌రీరానికి కావ‌ల్సిన పోష‌కాల‌న్నీ ల‌భిస్తాయ‌ని మ‌నంద‌రికీ తెలుసు. త‌క్కువ ఖ‌ర్చులో శ‌రీరానికి పోష‌కాల‌ను అందించే ఆహారాల్లో గుడ్డు ఒక‌టి. గుడ్డును ఆహారంలో భాగంగా తీసుకోవ‌డం వ‌ల్ల ఎముక‌లు దృఢంగా ఉంటాయి. కండ‌రాలు బలంగా త‌యార‌వుతాయి. ర‌క్త హీన‌త స‌మ‌స్య త‌గ్గుతుంది. మెద‌డు చురుకుగా ప‌ని చేస్తుంది. బ‌రువు త‌గ్గ‌డంలో కూడా కోడి గుడ్డు స‌హాయ‌ప‌డుతుంది. కోడి గుడ్డుతో ర‌క‌ర‌కాల వంట‌ల‌ను త‌యారు చేస్తూ ఉంటాం. కోడి గుడ్డుతో చేసే వంట‌లలో కోడి గుడ్డు ట‌మాట కూర ఒక‌టి. విలేజ్ స్టైల్ లో కోడి గుడ్డు ట‌మాట కూర‌ను ఎలా త‌యారు చేసుకోవాలి.. అన్న వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం.

Boiled Egg Tomato Curry very tasty if you do like this
Boiled Egg Tomato Curry

కోడి గుడ్డు ట‌మాట కూర త‌యారీకి కావల్సిన ప‌దార్థాలు..

ఉడికించిన కోడి గుడ్లు – 5, త‌రిగిన ఉల్లిపాయ‌లు – 2, త‌రిగిన ట‌మాటాలు- 3 (పెద్ద‌వి), క‌రివేపాకు – ఒక రెబ్బ‌, తరిగిన ప‌చ్చి మిర్చి – 3, పసుపు – ఒక టీ స్పూన్, ధ‌నియాల పొడి – అర టేబుల్ స్పూన్, ఎండు కొబ్బ‌రి పొడి – అర టేబుల్ స్పూన్, ఉప్పు – రుచికి త‌గినంత‌, కారం – ఒక‌టిన్న‌ర టేబుల్ స్పూన్, అల్లం వెల్లుల్లి పేస్ట్ – ఒక టేబుల్ స్పూన్, త‌రిగిన కొత్తిమీర – కొద్దిగా.

కోడి గుడ్డు ట‌మాట కూర త‌యారు చేసే విధానం..

ముందుగా ఒక గిన్నెలో త‌రిగిన ట‌మాటాలు, ప‌సుపు, కారం, రుచికి త‌గినంత ఉప్పును వేసి క‌లిపి చేత్తో ట‌మాటాల‌ను మెత్త‌గా చేసుకోవాలి. త‌రువాత ఒక క‌ళాయిలో నూనె వేసి కాగిన త‌రువాత ఉడికించిన గుడ్ల‌ను వేసి వేయించి ఒక ప్లేట్ లోకి తీసుకోవాలి. అదే క‌ళాయిలో త‌రిగిన ఉల్లిపాయ‌లు, ప‌చ్చి మిర్చి, క‌రివేపాకు వేసి వేయించుకోవాలి. ఇవి కొద్దిగా వేగిన త‌రువాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి క‌లిపి ఉల్లిపాయ‌లు ఎర్ర‌గా అయ్యే వ‌ర‌కు వేయించుకోవాలి. ఇవి వేగిన త‌రువాత ముందుగా మెత్త‌గా చేసుకున్న ట‌మాట గుజ్జును వేసి క‌లిపి మూత పెట్టి నూనె పైకి తేలే వ‌ర‌కు ఉడికించుకోవాలి.

త‌రువాత త‌గినన్ని నీళ్లు పోసి మ‌రో 5 నిమిషాల పాటు ఉడికించాలి. ఇప్పుడు ముందుగా వేయించి పెట్టుకున్న కోడిగుడ్ల‌ను, ధ‌నియాల పొడి, ఎండు కొబ్బ‌రిని వేసి క‌లిపి 5 నిమిషాల పాటు ఉడికించి, చివ‌ర‌గా కొత్తిమీర‌ను వేసి స్ట‌వ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా చేయ‌డం వల్ల ఎంతో రుచిగా ఉండే కోడి గుడ్డు ట‌మాట కూర త‌యార‌వుతుంది. దీనిని అన్నం, చ‌పాతీ, రాగి సంగ‌టి, దోశ వంటి వాటితో క‌లిపి తింటే చాలా రుచిగా ఉంటుంది. కోడి గుడ్ల‌తో ఈ విధంగా కూర‌ను త‌యారు చేసుకుని తిన‌డం వ‌ల్ల గుండె ఆరోగ్యంతోపాటు కంటి చూపు కూడా మెరుగుప‌డుతుంది. చ‌ర్మం, జుట్టు ఆరోగ్యంగా ఉంటాయి.

D

Recent Posts