మధ్యప్రదేశ్‌లోని రత్లామ్‌లో జరిగిన ఒక సంఘటన అందరిని ఆశ్చర్యపరుస్తుంది. కలుషితమైన దోసకాయను తిని 5 ఏళ్ల బాలుడు మరణించాడు. ముగ్గురు పిల్లలతో సహా నలుగురు సభ్యులు బలమ్ దోసకాయలను తిన్నారు . దీనిని ఆఫ్రికన్ ఖీరా అని కూడా పిలుస్తారు. ఇది తిన్న కొద్ది సేపటికి వారికి వాంతులు, వికారం రావడం జరిగింది. అంతేకాకుండా తీవ్రమైన కడుపునొప్పి కూడా రావడంతో వారు సమీపంలోని ఆసుపత్రికి వెళ్లారు. అయితే మార్గ మధ్యలో ఓ బాలుడు మృతి చెందాడు. దానికి కారణం సాల్మొనెల్లా విషప్రయోగం వల్ల కావచ్చునని వైద్యులు చెబుతున్నారు. దీని వలన శరీరం నుండి ఎలక్ట్రోలైట్స్ కోల్పోయేలా చేస్తుంది.
సాధారణంగా కొన్ని రోజుల్లో దానంతట అదే తగ్గిపోయినప్పటికీ, వ్యాధి నిరోధక శక్తి స్థాయిలను బట్టి కొద్ది మందిలో ఈ ఇన్ఫెక్షన్ అత్యంత ప్రమాదకరం మరియు ప్రాణాపాయం కూడా కలిగిస్తుందని నిపుణులు చెబుతున్నారు. సాల్మొనెల్లా విషప్రయోగం వలన ఇలా జరుగుతుందని కొందరు చెబుతున్నారు. సాల్మొనెల్లా బాక్టీరియా కారణంగా తీవ్రమైన విరేచనాలు మరియు కడుపు నొప్పులను కలిగిస్తుంది. దీనిని గ్యాస్ట్రోఎంటెరిటిస్ అని కూడా పిలుస్తారు. ఇది కడుపులోని యాసిడ్ మరియు రోగనిరోధక వ్యవస్థను దాటి మిమ్మల్ని అనారోగ్యానికి గురి చేస్తుంది. మీ ప్రేగులలోని కణాలపై దాడి చేసి నాశనం చేస్తుంది..గత సంవత్సరం, భారతదేశంలో, కనీసం 11,269 సాల్మొనెల్లా విషప్రయోగం కేసులు నమోదయ్యాయి.
సాల్మొనెల్లా విషం యొక్క సంకేతాలు మరియు లక్షణాలు ఏంటంటే.. అతిసారం మరియు వాంతులు కాకుండా మీ మలంలో రక్తం,అధిక జ్వరం, కడుపు తిమ్మిరి, వికారం, తీవ్రమైన తలనొప్పి,ఆకలి లేకపోవడం జరుగుతుంది. ఎవరైనా సాల్మొనెల్లాను పొందవచ్చని వైద్యులు చెబుతున్నారు, అయితే మీ వయస్సు, మీ జీవన పరిస్థితులు మరియు కొన్ని అనారోగ్యాలు మరియు మందులను బట్టి మీరు ఇన్ఫెక్షన్ లేదా తీవ్రమైన అనారోగ్యానికి గురయ్యే ప్రమాదం ఎక్కువగా ఉండవచ్చు. తరచుగా యాంటాసిడ్లు లేదా యాంటీబయాటిక్స్ తీసుకోవడం వలన సాల్మోనెల్లా ప్రమాదం నుండి తప్పించుకోవచ్చు. 5 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్నవారికి తక్కువ రోగ నిరోధక శక్తి ఉంటుంది కాబట్టి త్వరగా ఈ వ్యాధి బారిన పడుతుంటారు.