Bread Curd Rolls : బ్రెడ్ పెరుగు రోల్స్ ఇలా చేయండి.. విడిచిపెట్ట‌కుండా మొత్తం తినేస్తారు..!

Bread Curd Rolls : మ‌నం బ్రెడ్ తో ర‌క‌ర‌కాల చిరుతిళ్ల‌ను త‌యారు చేస్తూ ఉంటాము. బ్రెడ్ తో చేసే చిరుతిళ్లు చాలా రుచిగా, క్రిస్పీగా ఉండ‌డంతో పాటు చాలా సుల‌భంగా వీటిని త‌యారు చేసుకోవ‌చ్చు. బ్రెడ్ తో చేసుకోద‌గిన స్నాక్ ఐట‌మ్స్ లో బ్రెడ్ రోల్స్ కూడా ఒక‌టి. కింద చెప్పిన విధంగా చేసే ఈ బ్రెడ్ రోల్స్ లోప‌ల మెత్త‌గా బ‌య‌ట క్రిస్పీగా చాలా రుచిగా ఉంటాయి. పిల్లలు వీటిని ఎంతో ఇష్టంగా తింటార‌ని చెప్ప‌వ‌చ్చు. ఈ బ్రెడ్ రోల్స్ ను త‌యారు చేయ‌డం కూడా చాలా సుల‌భం. ఎంతో రుచిగా, క్రిస్పీగా ఉండే బ్రెడ్ రోల్స్ ను ఎలా త‌యారు చేసుకోవాలి.. త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు ఏమిటి.. అన్న వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం.

బ్రెడ్ రోల్ త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు..

పెరుగు – ఒక క‌ప్పు, పనీర్ తురుము – పావు క‌ప్పు, క్యారెట్ తురుము – పావు క‌ప్పు, చిన్న‌గా త‌రిగిన ప‌చ్చిమిర్చి – 1, త‌రిగిన క్యాప్సికం – చిన్న‌ది ఒక‌టి, ఉప్పు – కొద్దిగా, మిరియాల పొడి – పావు టీ స్పూన్, త‌రిగిన కొత్తిమీర – కొద్దిగా, ప్రెష్ సాండ్విచ్ బ్రెడ్ – 5, మైదాపిండి – ఒక టేబుల్ స్పూన్, నూనె – డీప్ ఫ్రైకు స‌రిప‌డా.

Bread Curd Rolls recipe in telugu very tasty snacks
Bread Curd Rolls

బ్రెడ్ రోల్ త‌యారీ విధానం..

ముందుగా ఒక వ‌స్త్రంలో పెరుగును వేసి మూట క‌ట్టాలి. త‌రువాత పెరుగులో ఉండే నీరంతా పోయేలా ఈ మూట‌ను రాత్రంతా వేలాడ‌దీయాలి. లేదంటే క‌నీసం 3 గంటల పాటు వేలాడ‌దీయాలి. నీరంతా పోయి గ‌ట్టి ప‌డిన పెరుగును ఒక గిన్నెలోకి తీసుకోవాలి. త‌రువాత ఇందులో ప‌చ్చిమిర్చి, క్యారెట్ తురుము, క్యాప్సికం, ఉప్పు, మిరియాల పొడి, కొత్తిమీర వేసి క‌ల‌పాలి. తరువాత ఒక గిన్నెలో మైదాపిండిని తీసుకుని అందులో కొద్దిగా నీళ్లు పోసి పేస్ట్ లాగా చేసుకోవాలి. త‌రువాత బ్రెడ్ కు అంచుల‌ను తీసేసి వాటిని చ‌పాతీ క‌ర్ర‌తో ప‌లుచ‌గా వ‌త్తుకోవాలి. త‌రువాత ఇందులో రెండు టీ స్పూన్ల పెరుగు మిశ్ర‌మాన్న ఉంచి నెమ్మ‌దిగా రోల్ చేసుకోవాలి.

త‌రువాత అంచులను మైదాపిండితో మూసి వేయాలి. త‌రువాత రోల్ ప‌క్క‌ల‌కు కూడా స్ట‌పింగ్ బ‌య‌ట‌కు రాకుండా మైదాపిండితో మూసి వేయాలి. ఇలా అన్నింటిని త‌యారు చేసుకున్న క‌ళాయిలో నూనె పోసి వేడి చేయాలి. నూనె వేడ‌య్యాక రోల్స్ ను వేసి వేయించాలి. వీటిని మ‌ధ్య‌స్థ మంట‌పై లైట్ గోల్డెన్ బ్రౌన్ క‌లర్ అయ్యే వ‌ర‌కు వేయించి ప్లేట్ లోకి తీసుకోవాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల ఎంతో రుచిగా ఉండే బ్రెడ్ రోల్స్ త‌యార‌వుతాయి. వీటిని ట‌మాట కిచప్ లేదా పుదీనా చ‌ట్నీతో తింటే చాలా రుచిగా ఉంటాయి. సాయంత్రం స‌మ‌యాల్లో స్నాక్స్ గా తిన‌డానికి ఇవి చాలా చ‌క్క‌గా ఉంటాయి.

Share
D

Recent Posts