Sheekakai For Hair : జుట్టు అందంగా, ఒత్తుగా ఉండాలని ప్రతి ఒక్కరు కోరుకుంటారు. అందుకోసం ఎన్నో రకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. కానీ నేటి తరుణంలో చాలా మంది జుట్టు రాలడం, జుట్టు తెల్లబడడం, జుట్టు పెరగకపోవడం, జుట్టు పలుచగా ఉండడం వంటి వివిధ రకాల జుట్టు సమస్యలతో బాధపడుతున్నారు. ఎన్ని రకాల ప్రయత్నాలు చేసినప్పటికి జుట్టు సమస్యలతో బాధపడే వారు రోజురోజుకు పెరుగుతున్నారని చెప్పవచ్చు. అయితే ఇలా వివిధ రకాల జుట్టు సమస్యలతో బాధపడే వారు బయట మార్కెట్ లో లభించే హెయిర్ ప్రొడక్ట్స్ కు బదులుగా సహజంగా లభించే షీకాకాయ్ ను వాడడం వల్ల మంచి ఫలితం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. ఎంతోకాలంగా షికాకాయ్ ను మనం జుట్టు సంరక్షణలో వాడుతూ ఉన్నాము.
మన జుట్టును ఆరోగ్యంగా, అందంగా ఉంచడంలో షికాకాయ్ ఎలా పని చేస్తుంది…దీనిని వాడడం వల్ల మనకు కలిగే ప్రయోజనాలు ఏమిటి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం. షికాకాయ్ ను వాడడం వల్ల తలపై, జుట్టుపై ఉండే మురికి, అదనంగా ఉండే నూనెలు, మలినాలు చక్కగా తొలగించబడతాయి. ఇది సహజమైన క్లెన్సర్ లాగా పని చేస్తుంది. జుట్టును అందంగా, శుభ్రంగా ఉంచడంలో షికాకాయ ఎంతో దోహదపడుతుంది. అలాగే షికాకాయ్ ను వాడడం వల్ల తలలో చుండ్రు, తామర, దురద వంటి సమస్యలు తగ్గుతాయి. దీనిలో ఉండే యాంటీ ఫంగల్ లక్షణాలు చుండ్రును నివారించడంలో దోహదపడతాయి. రసాయనాలు కలిగిన షాంపుల వలె కాకుండా షికాకాయ్ సున్నితంగా చర్మ సమస్యలను దూరం చేస్తుంది.
అంతేకాకుండా షికాకాయ్ లో విటమిన్స్, యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉంటాయి. ఇవి జుట్టు కుదుళ్లను బలపరిచి జుట్టు పెరుగుదలను ప్రోత్సహిస్తాయి. షికాకాయ్ ను వాడడం వల్ల జుట్టు ఒత్తుగా, పొడవుగా పెరుగుతుంది. జుట్టు చివర్లు చిట్లడం తగ్గుతుంది. అలాగే దీనిని వాడడం వల్ల జుట్టు సహజమైన మెరుపును, మృదుత్వాన్ని సొంతం చేసుకుంటుంది. ఇక దీనిని వాడడం వల్ల తల చర్మం యొక్క పిహెచ్ స్థాయిలు అదుపులో ఉంటాయి. తలచర్మం జిడ్డుగా మారకుండా, పొడిబారకుండా ఉంటుంది. ఈ విధంగా షికాకాయ్ మన జుట్టు సంరక్షణలో ఎంతో ఉపయోగపడుతుందని హాని కలిగించే రసాయనాలు కలిగిన షాంపులను వాడడానికి బదులుగా జుట్టును శుభ్రపరుచుకోవడానికి షికాకాయ్ ను వాడడం వల్ల మంచి ఫలితాలను పొందవచ్చని నిపుణులు చెబుతున్నారు.