Cabbage Aloo Curry : క్యాబేజీ, ఆలు.. రెండూ క‌లిపి ఇలా కూర చేయండి.. ఎంతో బాగుంటుంది..!

Cabbage Aloo Curry : బంగాళాదుంప‌ల‌తో మ‌నం ఇత‌ర కూర‌గాయ‌ల‌ను కూడా క‌లిపి వండుతూ ఉంటాము. ఇలా బంగాళాదుంప‌ల‌తో చేసుకోద‌గిన రుచిక‌ర‌మైన వంట‌కాల్లో క్యాబేజి ఆలూ కూర కూడా ఒక‌టి. బంగాళాదుంప‌లు, క్యాబేజి క‌లిపి చేసే ఈ కూర చాలా రుచిగా ఉంటుంది. దీనిని ఎవ‌రైనా చాలా సుల‌భంగా త‌యారు చేసుకోవ‌చ్చు. అలాగే దీనిని చాలా త‌క్కువ స‌మ‌యంలో త‌యారు చేయ‌వ‌చ్చు. ఈ కూర‌ను తిన‌డం వ‌ల్ల మ‌నం క్యాబేజి, బంగాళాదుంప‌ల్లో ఉండే పోష‌కాల‌ను, ఆరోగ్య ప్ర‌యోజ‌నాల‌ను పొంద‌వ‌చ్చు. ఎంతో రుచిగా ఉండే ఈ క్యాబేజి ఆలూ కూర‌ను సుల‌భంగా చాలా త‌క్కువ స‌మ‌యంలో ఎలా త‌యారు చేసుకోవాలి.. త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు ఏమిటి.. అన్న వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం.

క్యాబేజి ఆలూ కూర త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు..

నూనె – 2 టేబుల్ స్పూన్స్, త‌రిగిన ఉల్లిపాయ – 1, త‌రిగిన ప‌చ్చిమిర్చి – 2, అల్లం వెల్లుల్లి పేస్ట్ -ఒక టీ స్పూన్, ఉప్పు – త‌గినంత‌, కారం – ఒక టీ స్పూన్ లేదా త‌గినంత‌, ప‌సుపు – పావు టీ స్పూన్, గ‌రం మ‌సాలా – ఒక టీ స్పూన్, పెద్ద ముక్క‌లుగా త‌రిగిన బంగాళాదుంప‌లు – 3, త‌రిగిన క్యాబేజి – పావుకిలో, నీళ్లు – అర గ్లాస్.

Cabbage Aloo Curry recipe in telugu very tasty easy to cook
Cabbage Aloo Curry

క్యాబేజి ఆలూ కూర త‌యారీ విధానం..

ముందుగా కుక్క‌ర్ లో నూనె వేసి వేడి చేయాలి. త‌రువాత ఉల్లిపాయ ముక్క‌లు, ప‌చ్చిమిర్చి, జీల‌క‌ర్ర వేసి వేయించాలి. ఉల్లిపాయ ముక్క‌లు వేగిన తరువాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించాలి. దీనిని ప‌చ్చి వాస‌న పోయే వ‌ర‌కు వేయించిన త‌రువాత ఉప్పు, కారం, ప‌సుపు, గ‌రం మ‌సాలా వేసి క‌ల‌పాలి. దీనిని ఒక నిమిషం పాటు వేయించిన త‌రువాత బంగాళాదుంప ముక్క‌లు వేసి క‌ల‌పాలి. వీటిని 5 నిమిషాల పాటు వేయించిన త‌రువాత క్యాబేజి వేసి క‌ల‌పాలి. త‌రువాత వీటిని 5 నుండి 10 నిమిషాల పాటు బాగా వేయించాలి. త‌రువాత నీళ్లు పోసి క‌ల‌పాలి. ఇప్పుడు కుక్క‌ర్ మూత పెట్టి 3 విజిల్స్ వ‌చ్చే వ‌ర‌కు ఉడికించి స్ట‌వ్ ఆఫ్ చేసుకోవాలి. ఆవిరి పోయిన త‌రువాత మూత తీసి కూర‌ను స‌ర్వ్ చేసుకోవాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల ఎంతో రుచిగా ఉండే క్యాబేజి ఆలూ కూర త‌యార‌వుతుంది. దీనిని అన్నం, రోటీ, చ‌పాతీ వంటి వాటితో తింటే చాలా రుచిగా ఉంటుంది. ఈ విధంగా సుల‌భంగా, రుచిగా క్యాబేజి ఆలూ కూర‌ను త‌యారు చేసుకుని తిన‌వ‌చ్చు.

D

Recent Posts