technology

నవంబర్ 1 త‌ర్వాత ఓటీపీలు రావా.. హెచ్చ‌రిక‌లు జారీ చేసిన ప‌లు టెలికాం కంపెనీలు..

స్పామ్ కాల్స్, మెసేజ్‌లను అడ్డుకునేందుకు టెలికాం నియంత్రణ సంస్థ ట్రాయ్ కొత్త నిబంధ‌న‌లు తీసుకురావాల‌ని భావించిన విష‌యం తెలిసిందే. సెప్టెంబర్ 1 నుంచి కొత్త రూల్స్ అమలు చేయాల్సిందేననే పట్టుమీద ఉన్నా దానిని నవంబర్ 1కి పోస్ట్ పోన్ చేశారు. ట్రాయ్ నిబంధనలకు ప్రతిస్పందనగా, టెలికాం కంపెనీలు అనేక కీలక సంస్థలు మరియు టెలిమార్కెటర్లు వాటిని పాటించడానికి ఇంకా సిద్ధంగా లేవని ఓటీపీ మరియు ఇతర ముఖ్యమైన సందేశాల డెలివరీ నవంబర్ 1 నుండి అంతరాయం కలిగించవచ్చని తెలిపాయి.

బ్యాంకులు మరియు ఇతర సంస్థలు పంపే సందేశాలను తప్పనిసరిగా ట్రాక్ చేయాలని ఈ ఏడాది ఆగస్టులో ట్రాయ్ టెలికాం కంపెనీలను ఆదేశించింది. అయితే టెలికాం కంపెనీలు నవంబర్ 1 నుండి కొత్త నిబంధనలను అమలు చేయడానికి సిద్ధంగా ఉన్నాయి, అయితే చాలా టెలిమార్కెటర్లు మరియు ప్రధాన సంస్థలు తమ సిస్టమ్‌లను సర్దుబాటు చేయడానికి మరింత సమయం కావాలి అని అడిగారు.అయితే దీనిని పొడిగించే అవ‌కాశం లేద‌ని అంటున్నారు. రెండు నెల‌ల స‌మ‌యం ఇస్తే త‌మ ఆప‌రేటింగ్ సిస్టంల‌ని అప్‌డేట్ చేసుకుంటామ‌ని తెలిపాయి. అయితే కొత్త నిబంధ‌న‌లు అమ‌లులోకి వ‌స్తే క‌స్ట‌మ‌ర్ల‌కి అన‌వ‌స‌ర ఓటీపీ, లావాదేవీల విష‌యంలో కొంత ఊర‌ట క‌లుగుతుంది.

can we get otps after november 1st

‘ఇంటర్నేషనల్ ఇన్‌కమింగ్ స్పూఫ్డ్ కాల్స్ ప్రివెన్షన్ సిస్టమ్’ను ప్రారంభించిన కేంద్ర కమ్యూనికేషన్ల మంత్రి జ్యోతిరాదిత్య సింధియా మాట్లాడుతూ.. సైబర్ నేరాల నుండి పౌరులను రక్షించడానికి ప్రభుత్వం చేస్తున్న మరో ప్రయత్నం అని అన్నారు.భార‌తీయ నెంబ‌ర్ల‌తో (+91) విదేశీ మోస‌పూర‌త కాల్స్ నుండి క‌స్ట‌మ‌ర్స్ ని ర‌క్షించేందుకు ప్ర‌భుత్వం చేస్తున్న ప్ర‌య‌త్ని ఇది అని ఆయ‌న అన్నారు. అయితే ట్రాయ్ అమ‌లులోకి వ‌స్తే ఓటీపీ, లావాదేవీల మెసేజ్‌ల‌కి తాత్కాలికంగా బ్రేక్ ప‌డే అవ‌కాశం ఉంది. దేశంలో రోజు రోజుకి సైబ‌ర్ క్రైమ్ బాగా జ‌రుగుతుండ‌డంతో ప్ర‌భుత్వం ఈ నిర్ణ‌యం తీసుకున్న‌ట్టు తెలుస్తుంది.

Sam

Recent Posts