vastu

వాస్తుశాస్త్రం ప్రకారం సీతాఫలం చెట్టును ఇంటి ఆవరణ‌లో పెంచుకోవచ్చా ?

సాధారణంగా చాలా మంది సంస్కృతి సాంప్రదాయాలతోపాటు వాస్తు శాస్త్రాన్ని కూడా ఎంతగానో నమ్ముతారు. ఈ క్రమంలోనే ఇంటి ఆవరణలో పెంచుకునే మొక్కల విషయంలో కూడా వాస్తు శాస్త్రాన్ని పరిగణనలోకి తీసుకుంటారు. ఈ విధంగా వాస్తు శాస్త్రం ప్రకారం మన ఇంటి ఆవరణలో కొన్ని రకాల మొక్కలను పెంచుకోకూడదని వాస్తుశాస్త్ర నిపుణులు చెబుతున్నారు. మన ఇంటి ఆవరణలో సీతాఫలం చెట్టును పెంచుకోవచ్చా లేదా అనే సందేహం చాలా మందిలో ఉంటుంది. మరి సీతాఫలం చెట్టును ఇంటి ఆవరణలో పెంచుకోవడం వల్ల ఏ విధమైనటువంటి ఫలితాలు కలుగుతాయో ఇక్కడ తెలుసుకుందామా..!

వాస్తు శాస్త్రం ప్రకారం సీతాఫలం చెట్టు మన ఇంటి ఆవరణంలో ఉండకూడదని వాస్తు శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. సీతాఫలం చెట్టు మన ఇంటి ఆవరణంలో ఉండటం వల్ల మన ఇంటిపై ప్రతికూల ప్రభావం అధికంగా పడుతుంది. ఈ క్రమంలోనే ఇంటి ఆవరణంలో సీతాఫలం చెట్టు ఉండకూడదని పండితులు చెబుతున్నారు. ఒక వేళ ఉన్నా కానీ సీతాఫలం చెట్టును నరకకూడదనీ, సీతాఫలం చెట్టు పక్కనే ఉసిరి లేదా అశోక చెట్లు నాటడం వల్ల వాస్తు దోషం తొలగిపోతుందని పండితులు చెబుతున్నారు.

can we grow custard apple tree in home according to vastu

వాస్తు శాస్త్రం ప్రకారం ఇంటి ఆవరణలో సీతాఫలం చెట్టు ఉండకపోయినా సీతాఫలాలతో లక్ష్మీదేవికి పూజ చేయటం వల్ల అష్టదరిద్రాలు తొలగిపోయి అష్టైశ్వర్యాలు కలుగుతాయని పండితులు చెబుతున్నారు. సీతాఫలం ఆధ్యాత్మికంగా మంచి ఫలితాలను ఇచ్చినప్పటికీ వాస్తు శాస్త్రం ప్రకారం సీతాఫలం చెట్టు ఇంటి ఆవరణంలో ఉండకూడదని నిపుణులు తెలియజేస్తున్నారు.

Admin

Recent Posts