lifestyle

Dogs : కుక్కలని ఇంట్లో పెంచుకోవచ్చా..? చెడు జరుగుతుందా..?

Dogs : చాలా మంది ఇళ్లల్లో కుక్కలని పెంచుకుంటూ ఉంటారు. కుక్కల్ని పెంచుకోవడం మంచిదా కాదా అనే సందేహం కూడా చాలా మందిలో ఉంది. అయితే మరి ఇళ్లల్లో కుక్కల్ని పెంచుకోవచ్చా లేదా అనే విషయాన్ని ఈరోజు మనం చూసేద్దాం. ఇంట్లో కుక్కల్ని పెంచుకోవడం తప్పుకాదు. ఇంట్లో కుక్కల్ని పెంచుకోవచ్చు. కుక్కతో మనకి స్ట్రాంగ్ బాండింగ్ ఏర్పడుతుంది. ఒత్తిడి అంతా కూడా పోతుంది. కాసేపు పెంపుడు జంతువుల‌తో సమయాన్ని గడిపితే ఎంతో బాగుంటుంది. పైగా కుక్కలు ఇంట్లో ఉండడం వలన ఎవరైనా ఇంటికి వచ్చినా మనకి తెలిసిపోతుంది. అయితే కుక్క ఏడిస్తే ఎవరైనా చనిపోతారని అరిష్టమని మంచిది కాదని చాలామంది భావిస్తారు.

వీధుల్లో కుక్కలు ఏడుస్తున్నప్పుడు చాలామంది అందుకే తరిమేస్తారు. కుక్కలకి అతీంద్రియ శక్తులు ఉంటాయని చెడు జరిగే అంశాలు వాటికి ముందుగా తెలుస్తాయని కూడా అంటూ ఉంటారు. ఎవరైనా చనిపోయే ముందు వాటికి తెలిసిపోతుందని కూడా చెప్తూ ఉంటారు. ఇలా ఒక్కొక్కరిలో ఒక్కో నమ్మకం ఉంటుంది. కానీ నిజానికి కుక్కలు చాలా విశ్వాసంతో ఉంటాయి.

can we pet dogs in home or what

పూర్వకాలం నుండి ఇళ్లలో పిల్లులని కుక్కలని, ఆవులని, మేకలని మొదలైన వాటిని పూర్వీకులు పెంచుకుంటూ వచ్చారు. అదే పద్ధతి ఇప్పుడు కూడా కొనసాగుతోంది. కుక్కలు ఇంట్లో ఉండటం వలన ఎలాంటి తప్పు జరగదు. చెడేమి సంభవించదు. కుక్కలు ఉండడం ఇంకా మన మంచికే. ఇంట్లోకి ఎలుకలు మొదలైనవి కుక్కలు ఉంటే రావు.

ఇంట్లోకి భయంకరమైన పాములు వంటివి వచ్చినా కూడా కుక్క తరిమి కొడుతుంది. ఒకవేళ కనుక తరిమికొట్టకపోయినా పాకులాడుతుంటే మనం చూసి అలర్ట్ అవ్వచ్చు. కుక్క వల్ల ఇంకా మనకి భద్రత ఉంటుంది. చక్కగా ప్రశాంతంగా మనం నిద్రపోవచ్చు. మరీ ముఖ్యంగా ఇంట్లో కుక్క ఉండడం వలన నెగటివ్ ఎనర్జీ దూరమైపోయి పాజిటివ్ ఎనర్జీ కలుగుతుంది. ఇది నిజంగా ఎంతో మేలు కలుగుతుంది. మంచి వైబ్రేషన్స్ వస్తాయి. చెడు, దుష్టశక్తులు వంటివి పోతాయి పాజిటివిటీ కలుగుతుంది.

Admin

Recent Posts