ఆధ్యాత్మికం

Shiv Ling : ఇంట్లో శివ‌లింగాన్ని పెట్టుకోవ‌చ్చా..? ఎలాంటి నియ‌మాల‌ను పాటించాలి..?

Shiv Ling : పూజకి సంబంధించిన విషయాల్లో, ఎన్నో సందేహాలు చాలామందిలో ఉంటాయి. ప్రతి ఊర్లో కూడా శివాలయం ఉంటుంది. శివాలయం లేని ఊరు ఉండదు. ప్రత్యేకించి శివుడిని చాలా మంది ఆరాధిస్తూ ఉంటారు. ప్రతి సోమవారం, శివాలయానికి ప్రత్యేకంగా పూజలు జరుపుతారు. అయితే, కొంతమంది ఇళ్లల్లో, దేవుని మందిరంలో, శివలింగాన్ని పెట్టి శివుడికి పూజ చేస్తూ ఉంటారు. కొంతమంది ఇంట్లో శివలింగం ఉండకూడదని అంటూ ఉంటారు. నిజానికి, శివలింగం ఇంట్లో ఉండొచ్చా..? ఉండకూడదా..? ఈ ప్రశ్న మీలో కూడా ఉన్నట్లయితే, ఇప్పుడే క్లియర్ చేసుకోండి.

లింగ రూపంలో శివార్చన చేయకూడదని అంటూ ఉంటారు. శివపురాణం, దేవి భాగవతం, స్కంద పురాణం వంటి పురాణాలని చూసినప్పుడు, ఇంట్లో శివలింగం ఉండడం తప్పు కాదని అనిపిస్తుంది. శివలింగాన్ని ఇంట్లో పెట్టి పూజించడం వలన, ఐశ్వర్యం కలుగుతుంది. శివలింగం ఇంట్లో ఉంటే, ఐశ్వర్యం కలగడంతో పాటుగా, ఇంట్లో ప్రశాంతమైన వాతావరణం కలుగుతుంది. అయితే, శివలింగాన్ని పెట్టుకునేటప్పుడు, కొన్ని సూచనలని, నియమాలని పాటించాలి. పండితులు చెప్పిన దాని ప్రకారం, బొటన వేలంత మాత్రమే శివలింగం ఇంట్లో ఉండాలి.

can we put shiv ling in home

మనం పిడికిలి బిగిస్తే, అందులో ఇమిడిపోయి, బయటకి కనపడకుండా ఉన్నంత సైజులో శివలింగాన్ని పెట్టుకోవచ్చు. అంతకన్నా పెద్దది పెట్టకూడదు. శివలింగానికి కుంకుమతో పూజ చేయకూడదు. శివలింగం కనుక ఇంట్లో ఉందంటే, ప్రతిరోజు తప్పనిసరిగా అభిషేకం చేయాలి.

అలానే నైవేద్యం కూడా పెట్టాలి. ఒకవేళ కనుక ఎక్కడికైనా వెళ్లాల్సిన పరిస్థితి వచ్చి, ఇంట్లో పూజ చేయలేనప్పుడు, శివలింగాన్ని బియ్యం బస్తాలో పెట్టి, వెళ్లడం మంచిది. ఈ విధంగా చేయడం వలన, పూజ చేయని దోషం రాదు, చూశారు కదా ఇంట్లో శివలింగం ఉంటే, ఎలాంటి శివలింగం ఉండాలి..?, ఎలా పూజ చేయాలని.. మరి ఈ తప్పులు చేయకుండా శివలింగాన్ని పూజించండి. పరమేశ్వరుడి అనుగ్రహం పొందండి.

Admin

Recent Posts