హెల్త్ టిప్స్

Banana With Ghee : ఈ మిశ్ర‌మాన్ని ఉద‌యాన్నే ప‌ర‌గ‌డుపునే తినండి.. ఏం జ‌రుగుతుందో తెలుసా..?

Banana With Ghee : అరటిపండులో ఎన్నో పోషకాలు, ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. అలాగే నెయ్యిలో కూడా ఎన్నో పోషకాలు, ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. ఈ రెండింటినీ కలిపి తింటే రెట్టింపు ప్రయోజనాలు కలగడ‌మే కాకుండా ఎన్నో అనారోగ్య సమస్యలు తగ్గుతాయి. ఒత్తిడి, ఆందోళన వంటివి తగ్గుతాయి. బాగా పండిన అరటిపండును గుజ్జుగా చేసి దానిలో ఒక టీస్పూన్ నెయ్యి వేసి బాగా కలిపి తినాలి. ఉదయం పరగడుపున తింటే మంచిది. ఉదయం సమయంలో తింటే అలసట, నీరసం వంటివి లేకుండా రోజంతా హుషారుగా ఉంటారు.

అలాగే కండరాలు దృఢంగా ఉండి వాటి పనితీరు బాగుంటుంది. నెయ్యిలో ఉండే విటమిన్ డి ఎముకలు బలంగా ఉండేలా చేస్తుంది. శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచి ఎటువంటి ఇన్ ఫెక్షన్స్ రాకుండా కాపాడుతుంది. అరటిపండులో ఫైబర్ అధికంగా ఉండ‌డం వల్ల‌ గ్యాస్, మలబద్దకం, కడుపు ఉబ్బరం వంటి సమస్యలు లేకుండా చేస్తుంది. అరటిపండు, నెయ్యిలో ఉండే ప్రొటీన్లు బరువు తక్కువ ఉన్నవారిలో బరువును పెంచుతాయి.

banana with ghee many benefits

అరటిపండు, నెయ్యి చర్మానికి చాలా మేలును చేస్తాయి. అరటిపండు, నెయ్యి తినడం వల్ల చర్మ కణాలను పునరుజ్జీవింపజేస్తాయి. ఇవి చర్మాన్ని మెరుగుపరుస్తాయి. చర్మంపై సహజమైన మెరుపును తెస్తాయి. అలాగే చర్మం మెరుస్తూ అందంగా మారుతుంది. ఇలా ఈ మిశ్ర‌మంతో ఎన్నో లాభాలు ఉన్నాయి క‌నుక దీన్ని రోజూ తినాలి. దీంతో అన్ని విధాలుగా ఆరోగ్యంగా ఉండ‌వ‌చ్చు.

Admin

Recent Posts