Capsicum Kaju Masala : క్యాప్సికం, జీడిప‌ప్పుతో మ‌సాలా కూర‌.. చ‌పాతీ, అన్నంలోకి బాగుంటుంది..

Capsicum Kaju Masala : క్యాప్సికం అన‌గానే మ‌న‌కు ఎక్కువ‌గా గుర్తొచ్చేది పాశ్చాత్య వంట‌లే. అమెరికా లాంటి దేశాల్లో క్యాప్సికంను పిజ్జా, బ‌ర్గ‌ర్, పాస్తా, నూడుల్స్ లాంటి వంట‌ల్లో ఎక్కువ‌గా వాడుతూ ఉంటారు. మ‌న‌దేశంలో ముఖ్యంగా తెలుగు ప్ర‌జ‌లు త‌మ వంటిల్ల‌లో క్యాప్సికం ను వాడ‌డం త‌క్కువ‌నే చెప్పాలి. అయితే ఇక్క‌డి రెస్టారెంట్ల‌లో కొన్ని ర‌కాల మాంసాహార ఇంకా శాఖాహార మ‌సాల కూర‌ల్లో ఎక్కువ‌గానే వాడుతూ ఉంటారు. కాబ‌ట్టి ఇప్పుడు రెస్టారెంట్ త‌ర‌హాలో క్యాప్సికం కాజూ మ‌సాల క‌ర్రీని ఎలా త‌యారు చేయాలో తెలుసుకుందాం. క్యాప్సికంను అంత‌గా ఇష్ట‌ప‌డ‌ని వారు కూడా ఇలా చేస్తే ఎంతో ఇష్టంతో తింటారు.

క్యాప్సికం కాజూ మ‌సాలా కర్రీ త‌యారు చేయ‌డానికి కావాల్సిన ప‌దార్థాలు..

గ్రీన్ క్యాప్సికం- 6, రెడ్ క్యాప్సికం- 2, పాలు- అర క‌ప్పు, ఉల్లిపాయ‌లు- 3, వెల్లుల్లి రెబ్బ‌లు- 15, ప‌సుపు- 1 స్పూన్, కారం- 1 స్పూన్, గ‌రం మ‌సాల- అర స్పూన్, జీల‌క‌ర్ర పొడి- పావు స్పూన్, గ‌స‌గ‌సాలు- ముప్పావు స్పూన్, కొబ్బరి తురుము- 1 టేబుల్ స్పూన్, జీడిప‌ప్పు- 12, జీల‌క‌ర్ర‌- 1 స్పూన్, ఉప్పు- త‌గినంత‌, నూనె- పావు క‌ప్పు.

Capsicum Kaju Masala recipe
Capsicum Kaju Masala

క్యాప్సికం కాజూ మ‌సాలా కర్రీని త‌యారు చేసే విధానం..

ముందుగా జీడిప‌ప్పు, గ‌స‌గ‌సాల‌ను ఒక గంట‌సేపు నీటిలో నాన‌బెట్టుకోవాలి. త‌రువాత కొబ్బ‌రి తురుము, వెల్లుల్లి రెబ్బ‌ల‌తోపాటు నాన‌బెట్టిన జీడిప‌ప్పు, గ‌స‌గ‌సాల‌ను క‌లిపి మిక్సీలో వేసుకొని కొద్దిగా నీళ్లు క‌లిపి మెత్త‌ని పేస్టులా చేసి పక్క‌న పెట్టుకోవాలి. ఇప్పుడు స్ట‌వ్ పై ఒక క‌ళాయిలో నూనె వేసుకొని అది కాగాక అందులో జీల‌క‌ర్ర వేసి వేయించాలి. అది వేగాక‌ ఉల్లిపాయ‌లు వేసుకొని వేయించాలి. త‌రువాత క్యాప్సికం ముక్క‌లు, ఉప్పు, ప‌సుపు, కారం, గ‌రం మ‌సాల‌, జీల‌క‌ర్ర పొడి వేసి క‌ల‌పి మూత పెట్టాలి.

కాసేప‌టికి క్యాప్సికం ముక్క‌లు మెత్త‌బ‌డ‌తాయి. అప్పుడు పాలు ఇంకా ముందుగా చేసుకున్న పేస్టు వేసి క‌ల‌పాలి. కొద్దిసేప‌టి త‌రువాత గ్రేవీలా త‌యారై నూనె వేర‌వుతుంది. ఇప్పుడు క‌ళాయిని స్ట‌వ్ మీద నుండి దింపేయాలి. ఇక క్యాప్సికం కాజూ మ‌సాల కర్రీ రెడీ అయిపోయిన‌ట్లే. ఈ క‌ర్రీ చ‌పాతీతో పాటు అన్నంలోకి కూడా రుచిగా ఉంటుంది.

Share
Prathap

Recent Posts