Capsicum Masala Curry Recipe : క్యాప్సికంను ఇలా వండితే.. ఇష్టం లేని వారు కూడా మొత్తం తినేస్తారు..

Capsicum Masala Curry Recipe : మ‌నం ఆహారంగా తీసుకునే కూర‌గాయ‌ల్లో క్యాప్సికం కూడా ఒక‌టి. మ‌న‌కు వివిధ రంగుల్లో ఈ క్యాప్సికం ల‌భిస్తూ ఉంటుంది. చాలా మంది వీటిని ఎక్కువ‌గా ఆహారంగా తీసుకోరు. అప్పుడ‌ప్పుడూ అలా వంట‌ల్లో వేస్తూ ఉంటారు. కానీ క్యాప్సికంలో ఎన్నో ఆరోగ్య ప్ర‌యోజ‌నాలు దాగి ఉన్నాయి. గుండెను ఆరోగ్యంగా ఉంచ‌డంలో, చ‌ర్మాన్ని కాంతివంతంగా చేయ‌డంలో, షుగ‌ర్ వ్యాధిని నియంత్ర‌ణలో ఉంచ‌డంలో క్యాప్సికం మ‌న‌కు ఎంత‌గానో ఉప‌యోగ‌ప‌డుతుంది. క్యాప్సికంను ఆహారంలో భాగంగా చేసుకోవ‌డం చాలా అవ‌స‌రం. ఇత‌ర వంట‌ల్లో ఉప‌యోగించ‌డ‌మే కాకుండా క్యాప్సికంతో కూడా మ‌నం కూర‌ల‌ను త‌యారు చేసుకోవ‌చ్చు. అందులో భాగంగా రుచిగా, సుల‌భంగా క్యాప్సికం మ‌సాలా క‌ర్రీని ఎలా త‌యారు చేసుకోవాలి.. అన్న వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం.

క్యాప్సికం మ‌సాలా క‌ర్రీ త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు..

త‌రిగిన క్యాప్సికం – 250 గ్రా., త‌రిగిన ట‌మాట – 1, ఆవాలు – అర టీ స్పూన్, జీల‌క‌ర్ర – అర టీ స్పూన్, బిర్యానీ ఆకు – 1, అల్లం వెల్లుల్లి పేస్ట్ – ఒక టేబుల్ స్పూన్, ధ‌నియాల పొడి – ఒక టీ స్పూన్, గ‌రం మ‌సాలా – ఒక టీ స్పూన్, నాన‌బెట్టిన చింత‌పండు – 5 గ్రా., ఉప్పు – త‌గినంత‌, కారం – ఒక టేబుల్ స్పూన్, ప‌సుపు – పావు టీ స్పూన్, నూనె – 2 టేబుల్ స్పూన్స్, త‌రిగిన ఉల్లిపాయ – 1, త‌రిగిన ప‌చ్చిమిర్చి – 2, క‌రివేపాకు – కొద్దిగా, త‌రిగిన కొత్తిమీర – కొద్దిగా.

Capsicum Masala Curry Recipe in telugu know how to cook it
Capsicum Masala Curry Recipe

మ‌సాలా పేస్ట్ త‌యారీకి కావల్సిన పదార్థాలు..

ప‌ల్లీలు – 2 టేబుల్ స్పూన్స్, నువ్వులు – 2 టేబుల్ స్పూన్స్, ధ‌నియాలు – 2 టేబుల్ స్పూన్స్, గ‌స‌గ‌సాలు – ఒక టేబుల్ స్పూన్, మెంతులు – పావు టీ స్పూన్, జీల‌క‌ర్ర – అర టేబుల్ స్పూన్, ఎండు కొబ్బరి తురుము – 50 గ్రా.

క్యాప్సికం మ‌సాలా క‌ర్రీ త‌యారీ విధానం..

ముందుగా ఒక క‌ళాయిలో ఒక టీ స్పూన్ నూనె వేసి వేడి చేయాలి. నూనె వేడ‌య్యాక మ‌సాలా పేస్ట్ త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు వేసి వేయించాలి. త‌రువాత వీటిని ఒక జార్ లోకి తీసుకుని మెత్త‌గా మిక్సీ ప‌ట్టుకోవాలి. తరువాత త‌గిన‌న్ని నీళ్లు పోసి పేస్ట్ లా చేసుకోవాలి. ఇప్పుడు అదే క‌ళాయిలో నూనె వేసి వేడి చేయాలి. నూనె వేడ‌య్యాక బిర్యానీ ఆకు, ఆవాలు, జీల‌క‌ర్ర వేసి వేయిచాలి. ఇవి వేగిన త‌రువాత ప‌చ్చిమిర్చి, ఉల్లిపాయ ముక్క‌లు వేసి వేయించాలి. త‌రువాత అల్లం వెల్లుల్లి పేస్ట్, క‌రివేపాకు వేసి వేయించాలి. త‌రువాత ట‌మాట ముక్క‌లు వేసి మెత్త‌గా అయ్యే వ‌ర‌కు ఉడికించాలి. త‌రువాత క్యాప్సికం ముక్క‌ల‌ను వేసి 2 నిమిషాల పాటు క‌లుపుతూ వేయించాలి. త‌రువాత ముందుగా మిక్సీ ప‌ట్టుకున్న మ‌సాలా పేస్ట్, ప‌సుపు, ఉప్పు, కారం, ధ‌నియాల పొడి, గ‌రం మ‌సాలా పొడి వేసి క‌లపాలి. దీనిని నూనె పైకి తేలే వ‌ర‌కు వేయించాలి.

ఇలా వేయించిన తరువాత చింత‌పండు ర‌సం, ఒక గ్లాస్ నీటిని పోసి మూత పెట్టి 15 నిమిషాల పాటు ఉడికించాలి. త‌రువాత కొత్తిమీర‌ను వేసి క‌లిపి స్ట‌వ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల క్యాప్సికం మ‌సాలా క‌ర్రీ త‌యార‌వుతుంది. దీనిని అన్నం, చ‌పాతీ, బిర్యానీ, రోటి,పులావ్ వంటి వాటితో క‌లిపి తింటే చాలా రుచిగా ఉంటుంది. క్యాప్సికంతో ఇలా కూర‌ను చేసుకుని తిన‌డం వ‌ల్ల రుచిగా ఉండ‌డంతో పాటు క్యాప్సికంను తిన‌డం వ‌ల్ల క‌లిగే ప్ర‌యోజ‌నాల‌ను పొంద‌వ‌చ్చు. క్యాప్సికంను ఇష్ట‌ప‌డ‌ని వారు కూడా ఈ కూర‌ను ఎంతో ఇష్టంగా తింటారు.

D

Recent Posts