viral news

ప‌ట్టాల‌పై ఆగిపోయిన కారు.. మ‌రో వైపు ర‌న్నింగ్ ట్రెయిన్‌.. చివ‌ర‌కు ఏమైంది..? వీడియో వైర‌ల్‌..!

శనివారం ఒక సంఘటన చోటు చేసుకుంది. కత్రా షాబాజ్నగర్ నగర్ రైల్వే ట్రాక్ దగ్గర ఒక కారు పట్టాలపై ఇరుక్కుంది. గోరక్ పూర్ లక్నో ఇంటర్సిటీ ఎక్స్ప్రెస్ ఎమర్జెన్సీ బ్రేక్స్ వేసి ఆపాల్సిన పరిస్థితి కలిగింది. కారు నడిపే వ్యక్తి ముఖ్యమైన పని మీద వెళ్తున్నాడు. అయితే కంట్రోల్ తప్పాడు. ట్రాక్ పైకి కారు ఎక్కించేసాడు. వెంటనే రైల్వే అధికారులు యాక్షన్ తీసుకున్నారు.

చాలా ప్రయత్నాలు చేశారు. కారును తొలగించడానికి ఎంతో ప్రయత్నం చేశారు. రైల్వే గేట్ క్లోజ్ చేయడం వలన కంట్రోల్ తప్పిపోయింది. రైల్వే గేట్ ఇక పడిపోతున్న టైంలో స్పీడ్ గా వెళ్లడం వలన కంట్రోల్ తప్పి పట్టాల పైకి ఎక్కించేసాడు.

car stuck on train track what happened next video viral

పట్టాలపై వస్తున్న ఓ ట్రైన్ బ్రేకులు వేసి ఆపాల్సిన పరిస్థితి కలిగింది. ఇంతలో ప్రమాదం తప్పింది. ఇంకోపక్క మరో ట్రైన్ ట్రాక్ పైనుంచి వస్తోంది. గేట్ కీపర్ రైల్వే అధికారులకి చెప్పడంతో.. అధికారులు వచ్చి కారుని పట్టాల పై నుంచి తొలగించారు. అదృష్టవశాత్తు ఎవరికీ కూడా ఏ ప్రమాదం జరగలేదు.

Peddinti Sravya

Recent Posts