ఆధ్యాత్మికం

Mopidevi Temple : అత్యంత శ‌క్తివంత‌మైన ఆల‌యం ఇది.. ఒక్క‌సారి ద‌ర్శిస్తే చాలు.. శ‌ని దోషం పోతుంది, పెళ్లి, సంతానం.. అన్నీ ప్రాప్తిస్తాయి..!

Mopidevi Temple : దక్షిణ భారతదేశం లోని షణ్ముఖ దేవాలయాల్లో ఈ ఆలయం కూడా ఒకటి. అనేక మంది భక్తులు ఈ ఆలయానికి వస్తూ వుంటారు. మోపిదేవిలోని సుబ్రహ్మణేశ్వర స్వామి ఆలయం కి వెళ్లి మన కోరికలు చెబితే అవి తీరిపోతాయి. స్కాంద పురాణంలో కూడా కృష్ణానది మహత్య్మం, మోపిదేవి క్షేత్ర మహిమల గురించి వివరించారు.

దూర దూర ప్రాంతాల నుండి కూడా ఈ ఆలయానికి వచ్చి భక్తుల సుబ్రమణ్య స్వామి వారిని దర్శనం చేసుకుంటూ ఉంటారు. ఈ ఆలయానికి వినికిడి లోపం ఉన్న వాళ్ళు, పెళ్లి కాని వాళ్ళు, పిల్లలు లేనివారు, పెద్ద పెద్ద సమస్యలు ఉన్నవాళ్లు ఎక్కువగా వెళుతూ ఉంటారు. ఇక్కడికి వెళ్లి భగవంతుడిని కోరుకుంటే ఆ సమస్య నుండి బయట పడచ్చని భక్తుల నమ్మకం.

mopidevi temple visit once to many boons

అలానే ఏమైనా దోషాలు ఉన్న వాళ్లు కూడా ఈ ఆలయానికి వస్తూ ఉంటారు. ఆ సమస్య నుండి బయటపడాలని పూజలు చేయించుకుంటారు. ఇది చాలా శక్తివంతమైన ఆలయం ఈ ఆలయం లో సంతానం లేని వాళ్ళు ఒక రాత్రి నిద్ర చేస్తే సంతాన భాగ్యం కలుగుతుందని అంటూ ఉంటారు. ఇక్కడ సుబ్రహ్మణ్య స్వామి వారు శివలింగ ఆకారంలో ఉంటారు. ఒక పాము చుట్టలు చుట్టుకున్నట్లుగా ఉంటుంది. దాని మీద లింగాకారంలో స్కందుడు కొలువై ఉంటారు. ఇక ఈ ఆలయానికి ఎలా చేరుకోవాలనేది తెలుసుకుందాం.

విజయవాడ నుండి రెండు గంటల ప్రయాణం. విజయవాడ – అవనిగడ్డ దారిలో ఈ ఆలయం ఉంది. విజయవాడ నుండి అవనిగడ్డ వెళ్లే బస్సులు చాలా ఉంటాయి. ప్రతి రెండు గంటలకి కూడా కంకిపాడు, ఉయ్యూరు, పామర్రు, చల్లపల్లి మీదుగా విజయవాడ నుండి బస్సులు ఉంటాయి. విజయవాడ నాగాయ‌లంక బస్సులు కూడా ఇక్కడికి వెళ్తాయి. రైల్వే స్టేషన్ నుండి ఆటోలు కూడా ఉంటాయి. ఈ ఆలయానికి దగ్గరలో ఉండే రైల్వే స్టేషన్ రేపల్లె. ఈ ఆలయానికి దగ్గరలో ఉండే ఎయిర్ పోర్ట్ గన్నవరం అక్కడి నుండి బస్సు లేదా ప్రైవేట్ టాక్సీల ద్వారా మీరు ఆలయానికి చేరుకోవచ్చు.

Admin

Recent Posts