Carrot Puri : క్యారెట్లతోనూ ఎంతో రుచిగా ఉండే పూరీలను చేయవచ్చు తెలుసా.. ఎలాగంటే..?

Carrot Puri : క్యారెట్లను తినడం వల్ల ఎన్ని ఆరోగ్యకరమైన ప్రయోజనాలు కలుగుతాయో అందరికీ తెలిసిందే. వీటిని తింటే విటమిన్‌ ఎ పుష్కలంగా లభిస్తుంది. ఇది రోగ నిరోధకశక్తిని పెంచడమే కాక కంటి చూపును మెరుగు పరుస్తుంది. క్యారెట్లను రోజూ తింటే గుండె జబ్బులు రావు. అయితే క్యారెట్లను కొందరు తినలేకపోతుంటారు. కానీ వీటితో ఎంతో రుచిగా ఉండే పూరీలను చేసుకోవచ్చు. వీటిని అందరూ ఎంతో ఇష్టంగా తింటారు. వీటిని చేయడం కూడా సులభమే. ఈ క్రమంలోనే క్యారెట్‌ పూరీలను ఎలా తయారు చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.

క్యారెట్‌ పూరీల తయారీకి కావల్సిన పదార్థాలు..

గోధుమ పిండి – ఒక కప్పు, క్యారెట్‌ తురుము – అర కప్పు, జీలకర్ర – అర టీస్పూన్‌, పసుపు – అర టీస్పూన్‌, కారం – అర టీస్పూన్‌ (రుచి కావాలనుకుంటే), ఉప్పు – రుచికి సరిపడా, నీళ్లు – తగినన్ని, నూనె – డీప్‌ ఫ్రై కి సరిపడా.

Carrot Puri recipe in telugu make in this way very tasty
Carrot Puri

క్యారెట్‌ పూరీలను తయారు చేసే విధానం..

ఒక గిన్నె తీసుకుని అందులో గోధుమ పిండి, క్యారెట్‌ తురుము, జీలకర్ర, పసుపు, కారం, ఉప్పు వేసి బాగా కలపాలి. అనంతరం అందులో నెమ్మదిగా నీళ్లను పోస్తూ పూరీ పిండిలా కలపాలి. దీనిపై ఒక తడి వస్త్రాన్ని చుట్టి ఉంచాలి. లేదా ప్లాస్టిక్‌ కవర్‌ను సైతం చుట్టి ఉంచవచ్చు. ఇలా కలిపిన పిండిని 15 నుంచి 20 నిమిషాల పాటు పక్కన పెట్టాలి. దీంతో పిండి మృదువుగా మారి పూరీలు బాగా వస్తాయి. తరువాత పిండిని తీసుకుని బాగా కలుపుతూ చిన్న చిన్న ముద్దలు చేసుకోవాలి. వీటిని పూరీల్లా వత్తుకోవాలి. అనంతరం పాత్ర తీసుకుని నూనె వేసి మీడియం మంటపై కాగబెట్టాలి. నూనె కాగిన తరువాత అందులో ముందుగా సిద్ధం చేసుకున్న పూరీలను వేసి బాగా కాల్చాలి. పూరీలు రెండు వైపులా కాలిన తరువాత తీయాలి.

అనంతరం టిష్యూ ఉంచిన ప్లేట్‌లోకి తీసుకోవాలి. దీంతో అధికంగా నూనె పోతుంది. ఇలా అన్ని పూరీలను కాల్చుకోవాలి. దీంతో ఎంతో రుచిగా ఉండే క్యారెట్‌ పూరీలు రెడీ అవుతాయి. వీటిల్లో కారం వేసి చేసుకుంటే ఇంక ఇతర కూరలు ఏవీ అవసరం ఉండవు. కారం వద్దు అనుకుంటే పూరీలను ఏదైనా కూరతో కలిపి తినాలి. దీంతో ఇవి ఎంతో టేస్టీగా ఉంటాయి. అందరికీ నచ్చుతాయి. ఎల్లప్పుడూ చేసే రొటీన్‌ పూరీలు కాకుండా ఇలా ఒక్కసారి క్యారెట్‌ పూరీలను చేసి తినండి. ఇలా తింటే మళ్లీ మళ్లీ వీటినే కావాలంటారు.

Share
Editor

Recent Posts