information

70 ఏళ్లు పైబ‌డిన వారికి గుడ్ న్యూస్‌.. కేంద్రం కొత్త హెల్త్ ప్యాకేజీ..

మోదీ ప్ర‌భుత్వం 70 ఏళ్లు మరియు అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్న వృద్ధుల కోసం ప్రత్యేక ఆరోగ్య ప్యాకేజీని ప్రవేశపెట్టడానికి సిద్ధంగా ఉంది. ఈ ప‌థ‌కం ద్వారా దేశవ్యాప్తంగా ఉన్న‌ దాదాపు 60 మిలియన్ల మంది వ్యక్తులకు ప్రత్యక్షంగా ప్రయోజనం చేకూరుస్తుందని భావిస్తున్నారు.మోదీ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం దేశవ్యాప్తంగా 4.5 కోట్ల కుటుంబాలకు ప్రయోజనం చేకూరుస్తుందని అంటున్నారు. సామాజిక, ఆర్థిక స్థితితో సంబంధం లేకుండా 70 ఏళ్ల వయస్సు పైబడిన సీనియర్ సిటిజన్లందరూ ఈ ఆయుష్మాన్ భారత్ ప్రధాన మంత్రి జన్ ఆరోగ్య యోజన ప్రయోజనాలను పొందేలా మోదీ ప్ర‌భుత్వం క‌స‌ర‌త్తులు చేస్తుంది. ఈ నెలాఖరులోగా ఈ కొత్త ప్లాన్ అమల్లోకి వస్తుందని అంచనా.

ఈ కార్యక్రమం అమలు చేస్తే ప్రత్యేక సంరక్షణ మరియు ఇతర అవసరమైన ఆరోగ్య సేవలతో పాటు సీనియర్ సిటిజన్‌లకు ఉచిత వైద్య సేవలు కూడా అందే అవ‌కాశం ఉంది. ఆయుష్మాన్ భారత్ పథకం కింద ప్రస్తుతం ఉన్న జనరల్ మెడిసిన్, సర్జరీ, ఆంకాలజీ మరియు కార్డియాలజీ వంటి 27 రకాల వైద్య సేవలతో పాటు కొత్త ప్యాకేజీ సేవలని కూడా అందించే అవ‌కాశం ఉంటుందని ప్రభుత్వ వర్గాలు సూచించాయి. అదనంగా, రోగులు ఆసుపత్రి సేవలు, మందులు, భోజనం మరియు వసతికి ఉచితంగా పొందుతారు. 70 లేదా అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్న ఏ సీనియర్ సిటిజన్ అయినా ₹5 లక్షల వరకు ఉచిత వైద్య చికిత్సకు అర్హులు.

central government new health package for age above 70 years

మొత్తం 29,648 ఆసుపత్రులు ఇందులోకి రానుండ‌గా, అందులో ప్రభుత్వం మరియు ప్రైవేట్ ఆసుప‌త్రులు ఉంటాయి. ఆయుష్మాన్ భారత్ ప్రధాన మంత్రి జన్ ఆరోగ్య యోజన ప్రపంచంలోనే అతిపెద్ద ప్రభుత్వ నిధులతో నడిచే ఆరోగ్య భరోసా పథకం.ఈ ప‌థ‌కం వ‌ల‌న చాలా మందికి ప్ర‌యోజ‌నం చేకూరుతుంద‌ని ప‌లువురు నెటిజ‌న్స్ హ‌ర్షం వ్య‌క్తం చేస్తున్నారు. ప్ర‌స్తుతం ఇది 33 రాష్ట్రాలు మరియు కేంద్రపాలిత ప్రాంతాలలో పనిచేస్తోంది. సీనియర్ సిటిజన్ల ఆరోగ్యాన్ని పరిరక్షించడంతో పాటు, వారికి అవసరమైన ఆరోగ్య సంరక్షణ సేవలు అందించ‌డం వారి జీవితంలో వెలుగులు నింపేలా చేయాల‌ని ప్ర‌భుత్వం భావిస్తుంది.

Sam

Recent Posts