lifestyle

Chanakya Niti Telugu : ఎట్టి పరిస్థితుల్లో కుటుంబం ముందు.. ఈ తప్పులని చేయకండి.. మీకే ఇబ్బంది..!

Chanakya Niti Telugu : చాణక్య చెప్పినట్లు చేయడం వలన, జీవితం చాలా అద్భుతంగా ఉంటుంది. జీవితంలో ఎటువంటి కష్టాలు కూడా రావు. ప్రతి ఒక్కరు కూడా, జీవితంలో ముందుకు వెళ్లాలని సక్సెస్ ని అందుకోవాలని, చూస్తూ ఉంటారు. ఆచార్య చాణక్య చెప్పినట్లు ఆచరించడం వలన జీవితం బ్రహ్మాండంగా ఉంటుంది. అందులో సందేహం లేదు. అయితే, చాణక్య చెప్పిన దాని ప్రకారం కుటుంబం ముందు, ఎట్టి పరిస్థితులో ఈ తప్పులు చేయకూడదట. కుటుంబం ముందు ఎటువంటి తప్పులు చేయకూడదు అనే విషయాన్ని ఇప్పుడు తెలుసుకుందాం.

మరి ఇక తెలుసుకొని, మీరు కూడా ఆచరించండి. చాణక్య చెప్పిన దాని ప్రకారం, మనం మాట్లాడే మాటలు చాలా జాగ్రత్తగా ఉండాలి. మాట జారితే, మళ్ళీ వెనక్కి తీసుకోలేము. పైగా మాటలు ఎదుట వాళ్ళ హృదయాలని నొప్పించే విధంగా అస్సలు ఉండకూడదు. అలాంటి మాటలు మాట్లాడితే, ఇతరులు ఎంతో బాధపడతారు. అవి ఎక్కువ బాధని కలిగిస్తాయని గుర్తు పెట్టుకోండి. ఎప్పుడు కూడా ప్రేమతో మాట్లాడాలి తప్ప, ఒక మనిషిని నొప్పించే విధంగా మాట్లాడకూడదు.

chanakya niti do not make these mistakes before family

శత్రువు ముందు కూడా, మాటలతో చాలా జాగ్రత్తగా ఉండాలి. మన చర్యల ఫలితాన్ని మనం అనుభవిస్తాం. కొన్ని కొన్ని సార్లు, మన మాటలు గొప్ప విధ్వంసాన్ని కూడా ముగించవచ్చు. పైగా పిల్లల ముందు ఎట్టి పరిస్థితుల్లో కూడా తప్పు మాటలు మాట్లాడకూడదు. అవి పిల్లలపై ప్రభావం పడతాయి. మళ్లీ మళ్లీ వాళ్లు, అవే మాట్లాడవచ్చు. కాబట్టి, పిల్లల ముందు మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. అలానే, పిల్లలు ముందు ఏది మాట్లాడినా, ఏది చేసినా పిల్లలు వాటిని చూసి అనుసరిస్తారు అని తెలుసుకోండి.

పిల్లల ముందు, దూషించే పదాలని కూడా వాడకూడదు. పిల్లల ముందు మంచి మాట్లాడితే అది వాళ్ళ తీరుపై, ప్రభావం పడుతుందని గుర్తుపెట్టుకోండి. కాబట్టి, మంచి మాట్లాడండి. మంచి విషయాలను చెప్పండి. పిల్లల ముందు మద్యం సేవించడం వంటివి చేయకూడదు. భార్యాభర్తలు గొడవ పెట్టుకున్నా, పిల్లలకు దూరంగా వెళ్లి మాట్లాడుకోవాలి తప్ప వారి ముందు గొడవ పడకూడదు. కుటుంబం అందరి ముందు, భర్త తన భార్యని, పిల్లల్ని తక్కువ చేసి అస్సలు మాట్లాడకూడదు. దీనివలన వాళ్ళకి బాధ కలుగుతుంది.

Admin

Recent Posts