Lemon Water With Turmeric : ప్రతి ఒక్కరు కూడా, ఆరోగ్యంగా ఉండడానికి చూస్తారు. ఆరోగ్యంగా ఉండడం కోసం, ఇంటి చిట్కాలు చాలా చక్కగా పనిచేస్తాయి. ఔషధ గుణాలు ఉన్న ఆహార పదార్థాలను తీసుకుంటే, చాలా రకాల సమస్యలకు దూరంగా ఉండవచ్చు. చాలామంది రకరకాల సమస్యలతో, బాధపడుతున్నారు. వీటి నుండి బయట పడాలంటే, కొన్ని ఇంటి చిట్కాలు చక్కగా పనిచేస్తాయి. నిమ్మరసంలో పసుపు కలుపుకుని తీసుకుంటే, చక్కటి ప్రయోజనం ఉంటుంది.
ఒక్కో సీజన్లో ఒక్క విధంగా అనారోగ్య సమస్యలు వస్తాయి. వాటి నుండి, బయట పడాలంటే, ఇంటి చిట్కాలు బాగా పనిచేస్తాయి. జ్వరం, జలుబు, దగ్గు వంటి సమస్యల నుండి, ఈ చిట్కా మనల్ని దూరంగా ఉంచుతుంది. రోగనిరోధక శక్తిని కూడా పెంచుతుంది. నిమ్మకాయ, పసుపు నీరు చాలా ప్రభావితంగా పనిచేస్తాయి. సహజమైన డిటాక్సిఫయర్
నిమ్మ, పసుపు ని నీళ్లుల్లో కలిపి తాగితే, రోగనిరోధక శక్తి పెరుగుతుంది. నిమ్మకాయలో విటమిన్ సి తో ఉంటుంది. అలానే, పసుపులో కూడా మంచి గుణాలు ఉంటాయి. ఇమ్యూనిటీని ఇవి పెంచగలవు. నిమ్మ, పసుపు రెండిట్లో కూడా యాంటీ ఇంఫ్లమేటరీ గుణాలు ఉంటాయి. మంటని తగ్గించగలవు. నిమ్మరసంలో ఉండే, సిట్రిక్ యాసిడ్ జీర్ణక్రియని మెరుగుపరుస్తుంది.
ఆహారాన్ని బాగా జీర్ణం అయ్యేటట్టు చూస్తుంది. ఈ రెండిటిని కలిపి తీసుకుంటే, అజీర్తి, గ్యాస్ ఎసిడిటీ వంటి సమస్యలు కూడా ఉండవు. ఇలా నీళ్ళల్లో నిమ్మకాయ, పసుపు కలిపి తీసుకోవడం వలన ఆరోగ్యం బాగుంటుంది. భోజనానికి ముందు రాత్రిళ్ళు తీసుకోకండి. నిద్ర డిస్టర్బ్ అయ్యే అవకాశం ఉంది. మరీ ఎక్కువగా దీన్ని తీసుకోవద్దు. లిమిట్ గా మాత్రమే తీసుకోండి. లేదంటే, అనవసరంగా జీర్ణకోశ సమస్యలు వస్తాయి.