జున్నార్ లో చిరుత పులి దాడులు ఎక్కువ అవుతున్నాయి. వాటికి సంబంధించిన వీడియోలు సీసీటీవీలో కనిపించాయి. పూణేలో నివసించేవాళ్లు భయపడుతున్నారు. అక్టోబర్ 8న అర్ధరాత్రి ఈ సంఘటన చోటు చేసుకుంది, చిరుత పులి దూడను వెంటాడింది. ఇంటి బయట కట్టిన దూడను చంపడానికి ప్రయత్నం చేసి దగ్గర్లో ఉన్న పొలాలలోకి లాక్కొని వెళ్లి చంపింది. అంతేకాకుండా చిరుత పులి అడుగులను కూడా స్థానికులు ఎక్కువగా గమనిస్తున్నారు. ఇదంతా మంజరి కొలవాడి ప్రాంతంలో జరిగింది.
పూణేలో దీనికి సంబంధించిన మరణాలు చాలా ఎక్కువ అవుతున్నాయి దీంతో స్థానికులు అందరూ ఎంతో భయపడుతున్నారు. ముఖ్యంగా రైతులు పొలాల్లోకి వెళ్లడానికి కష్టమవుతోంది. పదిహేను రోజుల క్రితమే చిరుత పులి రెండు మేకలను కూడా చంపింది. తాజాగా వారం రోజుల క్రితం ఒక పశువుల షెడ్డు వద్దకు వెళ్ళింది.
కాకపోతే అది మొత్తం మూసివేయడంతో పశువులు సురక్షితంగా ఉన్నాయి. రైతులు వారి పంటలను పండించడానికి ఎంతో కష్టమవుతోందని ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కు తెలియజేస్తున్నారు. ఎన్నిసార్లు తెలియజేసిన ఎలాంటి ఉపయోగం లేదని దత్తాత్రేయ జోర్, సంజయ్ గైక్వాడ్, ఆనంద ముర్కుటే తెలియజేశారు. కేవలం పశువులు మాత్రమే కాకుండా పది రోజుల క్రితం నలభై ఏళ్ల మహిళను చిరుత పులి దాడి చేసి చంపింది. ఇది పింప్రీ పెందార్ గ్రామం లో, జున్నార్ తాలూకా, పూణే జిల్లాలో చోటు చేసుకుంది.