Chicken Nuggets : బేక‌రీలలో ల‌భించే ఎంతో రుచిక‌ర‌మైన చికెన్ న‌గ్గెట్స్‌ను ఇంట్లోనే ఇలా చేసుకోవ‌చ్చు.. ఎలాగంటే..?

Chicken Nuggets : మ‌న‌కు రెస్టారెంట్ ల‌లో ల‌భించే చికెన్ వెరైటీల‌లో చికెన్ న‌గ్గెట్స్ కూడా ఒక‌టి. చికెన్ న‌గ్గెట్స్ చాలా రుచిగా ఉంటాయి. పైన క్రంచీగా లోప‌ల సాఫ్ట్ గా ఉండే ఈ చికెన్ న‌గ్గెట్స్ ను అంద‌రూ ఎంతో ఇష్టంగా తింటూ ఉంటారు. అచ్చం బ‌య‌ట ల‌భించే విధంగా ఉండే ఈ చికెన్ న‌గ్గెట్స్ ను మ‌నం ఇంట్లో కూడా త‌యారు చేసుకోవ‌చ్చు. వీటిని త‌యారు చేయ‌డం చాలా తేలిక‌. తిన్నా కొద్ది తినాల‌నిపించేంత రుచిగా ఉండే ఈ చికెన్ న‌గ్గెట్స్ ను ఇంట్లో ఎలా త‌యారు చేసుకోవాలి.. త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు ఏమిటి.. అన్న వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం.

చికెన్ న‌గ్గెట్స్ త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు..

అర గంట పాటు ఉప్పు నీటిలో నాన‌బెట్టిన బోన్ లెస్ చికెన్ – 200 గ్రా., బ్రెడ్ స్లైసెస్ – 2, మిరియాల పొడి – ముప్పావు టీ స్పూన్, ఒర‌గానో – ఒక టీ స్పూన్, జీల‌క‌ర్ర పొడి – ముప్పావు టీ స్పూన్, ఉప్పు – త‌గినంత, ప‌సుపు – చిటికెడు, రెడ్ చిల్లీ ప్లేక్స్ – ఒక టీ స్పూన్, కోడిగుడ్లు – 2, మైదాపిండి – ఒక క‌ప్పు, బ్రెడ్ క్రంబ్స్ – ఒక క‌ప్పు, నూనె – డీప్ ఫ్రైకు స‌రిప‌డా.

Chicken Nuggets recipe in telugu very easy to make
Chicken Nuggets

చికెన్ న‌గ్గెట్స్ త‌యారీ విధానం..

ముందుగా బ్రెడ్ స్లైసెస్ కు ఉండే న‌ల్ల‌టి భాగాన్ని తీసేసి వాటిని ముక్క‌లుగా చేసి జార్ లోకి తీసుకోవాలి. త‌రువాత ఇందులో చికెన్, ఒర‌గానో, మిరియాల పొడి, జీల‌క‌ర్ర పొడి, ఉప్పు, ప‌సుపు, చిల్లీ ప్లేక్స్ వేసి మెత్త‌గా మిక్సీ ప‌ట్టుకోవాలి. త‌రువాత ఈ మిశ్ర‌మాన్ని ఒక గిన్నెలోకి తీసుకోవాలి. ఇప్పుడు చేతుల‌కు నూనె రాసుకుంటూ కొద్ది కొద్దిగా చికెన్ మిశ్ర‌మాన్ని తీసుకుంటూ న‌గ్గెట్స్ ఆకారంలో వ‌త్తుకోవాలి. త‌రువాత ఒక గిన్నెలో కోడిగుడ్ల‌ను వేసి బాగా క‌ల‌పాలి. త‌రువాత ఒక ప్లేట్ లో మైదా పిండిని, మ‌రో ప్లేట్ లో బ్రెడ్ క్రంబ్స్ ను తీసుకోవాలి. త‌రువాత ముందుగా త‌యారు చేసుకున్న చికెన్ న‌గ్గెట్స్ ను కోడిగుడ్డు మిశ్ర‌మంలో ముంచాలి. త‌రువాత మైదాపిండిలో వేసి బాగా కోట్ చేసుకోవాలి.

త‌రువాత ఈ న‌గ్గెట్ ను మ‌ర‌లా కోడిగుడ్డు మిశ్ర‌మంలో వేసి కోట్ చేసుకోవాలి. త‌రువాత‌ దీనిని బ్రెడ్ క్రంబ్స్ లో కోట్ చేసుకుని ప్లేట్ లోకి తీసుకోవాలి. ఇలా అన్నింటిని త‌యారు చేసిన త‌రువాత క‌ళాయిలో నూనె పోసి వేడి చేయాలి. నూనె వేడ‌య్యాక చికెన్ న‌గ్గెట్స్ ను వేసి మ‌ధ్య‌స్థ మంట‌పై కాల్చుకోవాలి. వీటిని గోల్డెన్ బ్రౌన్ క‌ల‌ర్ వ‌చ్చే వ‌ర‌కు వేయించుకుని ప్లేట్ లోకి తీసుకోవాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల ఎంతో రుచిగా ఉండే చికెన్ న‌గ్గెట్స్ త‌యార‌వుతాయి. వీటిని ట‌మాట కిచ‌ప్, మ‌యోనీస్ వంటి వాటితో క‌లిపి తింటే చాలా రుచిగా ఉంటాయి. వీకెండ్స్ లో, స్పెషల్ డేస్ లో ఇలా చికెన్ న‌గ్గెట్స్ ను ఇంట్లోనే త‌యారు చేసుకుని తిన‌వ‌చ్చు. వీటిని అంద‌రూ ఎంతో ఇష్టంగా తింటారు.

D

Recent Posts