Chicken Popcorn : సాయంత్రం స‌మ‌యంలో ఇలా వేడి వేడిగా చికెన్‌తో పాప్‌కార్న్ చేసి తినండి.. ప్లేట్ మొత్తం ఖాళీ చేస్తారు..!

Chicken Popcorn : మ‌నం చికెన్ తో కూర‌లు, బిర్యానీలే కాకుండా వివిధ ర‌కాల చిరుతిళ్ల‌ను కూడా త‌యారు చేస్తూ ఉంటాము. చికెన్ తో చేసే చిరుతిళ్లు చాలా రుచిగా, క్రిస్పీగా ఉంటాయి. మ‌నం చికెన్ తో చేసుకోద‌గిన వివిధ ర‌కాల చిరుతిళ్లల్లో చికెన్ పాప్ కార్న్ కూడా ఒక‌టి. చికెన్ పాప్ కార్న్ పైన క్రిస్పీగా, లోప‌ల జ్యూసీగా, మెత్త‌గా చాలా రుచిగా ఉంటుంది. స్నాక్స్ గా, సైడ్ డిష్ గా వీటిని తిన‌వ‌చ్చు. ఈ చికెన్ పాప్ కార్న్ త‌యారు చేయ‌డం చాలా సుల‌భం. మ‌న ఇంట్లో ఉండే ప‌దార్థాల‌తోనే వీటిని త‌యారు చేసుకోవ‌చ్చు. ఎంతో రుచిగా, క్రిస్పీగా ఉండే ఈ చికెన్ పాప్ కార్న్ ను ఎలా త‌యారు చేసుకోవాలి.. త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు ఏమిటి.. అన్న వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం.

చికెన్ పాప్ కార్న్ త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు..

మైదాపిండి – ఒక క‌ప్పు, కార్న్ ఫ్లోర్ – అర క‌ప్పు, ఉప్పు – త‌గినంత‌, మిరియాల పొడి – అర టీ స్పూన్, కారం – అర టీ స్పూన్, బేకింగ్ పౌడ‌ర్ – అర టీ స్పూన్, నూనె – డీప్ ఫ్రైకు స‌రిప‌డా.

Chicken Popcorn recipe in telugu make in this method
Chicken Popcorn

మ్యారినేష‌న్ కు కావ‌ల్సిన ప‌దార్థాలు..

బోన్ లెస్ చికెన్ – పావుకిలో, ఉప్పు – త‌గినంత‌, కారం – ఒక టీ స్పూన్, మిరియాల పొడి – ఒక టీ స్పూన్, ధ‌నియాల పొడి – ఒక టీ స్పూన్, అల్లం వెల్లుల్లి పేస్ట్ – ఒక టీ స్పూన్, నిమ్మ‌ర‌సం లేదా వెనిగ‌ర్ – ఒక టేబుల్ స్పూన్, పెరుగు – పావు క‌ప్పు.

చికెన్ పాప్ కార్న్ త‌యారీ విధానం..

ముందుగా బోన్ లెస్ చికెన్ ను గిన్నెలోకి తీసుకోవాలి. త‌రువాత ఇందులో మ్యారినేష‌న్ కు కావ‌ల్సిన ప‌దార్థాలు వేసి బాగా క‌ల‌పాలి. త‌రువాత ఈ చికెన్ ను 3 గంట‌ల పాటు మ్యారినేట్ చేసుకోవాలి. లేదంటే ఫ్రిజ్ లో ఉంచి రాత్రంతా మ్యారినేట్ చేసుకోవాలి. ఇలా మ్యారినేట్ చేసుకున్న త‌రువాత మ‌రో ప్లేట్ లో మైదాపిండి, ఉప్పు, కారం, మిరియాల పొడి, బేకింగ్ పౌడ‌ర్ వేసి క‌ల‌పాలి. ఇప్పుడు ఒక్కో చికెన్ ముక్క‌ను తీసుకుని పిండిలో డిప్ చేసి చేత్తో వ‌త్తుతూ ముక్క‌ల‌కు పిండిని బాగా పట్టించాలి. ఇలా పిండిని ప‌ట్టించిన త‌రువాత ప్లేట్ లోకి తీసుకోవాలి. ఇలా అన్నింటిని త‌యారు చేసుకున్న త‌రువాత క‌ళాయిలో నూనె పోసి వేడి చేయాలి. దీనిని మ‌ధ్య‌స్థ మంట‌పై వేడి చేయాలి.

నూనె వేడ‌య్యే లోపు మ‌రో ప్లేట్ లో మ‌ర‌లా ముందుగా తీసుకున్న‌ట్టు మైదాపిండి, ఉప్పు, కారం, మిరియాల పొడి, బేకింగ్ పౌడ‌ర్ వేసి క‌ల‌పాలి. ఇప్పుడు ముందుగా సిద్దం చేసుకున్న చికెన్ ముక్క‌ల‌ను మ‌ర‌లా పిండిలో ముంచి నూనెలో వేసుకోవాలి. ఈ చికెన్ ముక్క‌ల‌ను మ‌ధ్య‌స్థ మంట‌పై క్రిస్పీగా, ఎర్రగా అయ్యే వ‌ర‌కు వేయించుకుని ప్లేట్ లోకి తీసుకోవాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల ఎంతో రుచిగా ఉండే చికెన్ పాప్ కార్న్ త‌యార‌వుతుంది. ఈ విధంగా చికెన్ తో ఇంట్లోనే త‌యారు చేసుకుని తిన‌వ‌చ్చు. ఒక్క ముక్క కూడా విడిచిపెట్ట‌కుండా ఇంట్లో అంద‌రూ వీటిని ఇష్టంగా తింటారు.

D

Recent Posts